కాలానెప్పుడో జయించేసా
కార్తీకం కదిలి వైశాఖమిప్పుడు
రాను రానూ ఎండలు ముదిరి నన్నో అభావం ఆవరించక మునుపే
నీ నవ్వుల్లో చేరిపోవాలనుకున్నా
మనిద్దరి మధ్య ధ్వనిస్తున్న సంగీతం ఓ మహాకర్షణ మంత్రమై
పరధ్యానాన్ని పాడి పంపేసాక
నీ ఊహల్లో సమస్తమై ఆకాశం గుప్పిట్లోకొచ్చినట్టు
మనసు నిశ్చల ప్రశాంతం
మల్లెల కాలం మమేకమైన మధురమైన మోహం
వెనుక నుంచీ నువ్వొచ్చి హత్తుకున్న క్షణాల గర్వం
నీకు దూరమైన క్షణాలు అదృశ్యమై..
రంగుల కలగా మురిపించినందుకు
అలసట తీరిన ప్రభాతమీ నాడు
కురవాలనుకున్న నీ ప్రేమధార..
రేయంతా వెన్నెలధారగా కురిసినందుకు చూడు..:)
No comments:
Post a Comment