విరహమవుతున్నా వానొచ్చిన ప్రతిసారీ..
చినుకుగానైనా మారి నిన్ను తడమలేకున్నానని
ఎందుకో తెలీదు
తడిగా మారినప్పుడల్లా మనసు
మెత్తని ఏకాంతంలోకి జారిపోతుంది
నీపైకి మళ్ళించే గాలి కోసం
ఎదురుచూస్తూ కొంత మౌనాన్ని వహిస్తుంది
ఎదలో మొదలయ్యే తీపి ఆకలి
భరించలేనప్పుడు
కన్నీళ్ళ గుక్కపట్టి తీర్చేస్తుంది
దూరానికి చెరోకొసన మనమున్నా
ఓ అనుభూతి విషాదాన్ని అధిగమిస్తుంది
ఒక్కోసారి శూన్యమవుతున్నా
నీ చూపుల అలలో మత్తుగా తేలినట్టూహించి
రెప్పలమాటు నా కలను పదిలంగా దాచేస్తుంది 💜
No comments:
Post a Comment