Friday, 10 April 2020

// నటిస్తున్న కథ //

సంతోషం ఏ కాలానికి చెందినదో
నిశ్శబ్దాన్ని ప్రతిష్ఠించుకున్న హృదయానికి తెలిసుంటుందేమో
గడిచిందంతా జ్ఞాపకంలా మిగిలిపోయాక
నీడల్లోనూ నిర్వేదమే కనిపిస్తుంది..

ఎందుకు మొదలయ్యిందో తెలియని విషాదం
ఎప్పుడు అంతమవుద్దో తెలిసేలోగా చీకటి పరుచుకుంటుంది
ఆశను చంపుకుంటూ స్వరం మూగబోయి
శూన్యమనే అనుభూతికి దగ్గర దారి చూసుకుని నడుస్తుంది

ఎడారికి అడ్డంగా నడిచి మంచినీటి మెరుపుని
ఊహించడమే జీవితమైనందుకేమో..
రేయంతా నిద్రించినా కల వెలివేసి దూరమయ్యింది
లోకాన్ని నమ్మినట్టు నటిస్తున్న కథ ఎప్పటికి పూర్తయ్యేనో
ఇరుకు కన్నుల్లోని నీరు ఖాళీ ఎప్పుడయ్యేనో 😢

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *