ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ
చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు
నల్లనిమబ్బులమయమైన ఆకాశం
మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది
ఒంటరిగా యాతన పడుతున్న నిట్టూర్పు
పెదవంచునే నిలబడి కోసేస్తుంటే
మసకబారిన కళ్ళనూ..ఒణుకుతున్న వేళ్ళను
అడిగేందుకు ఏముంటుంది
వేగంగా కదులుతున్న భగ్నహృదయం
గొంతులో అడ్డుపడి మాటల్ని మింగినప్పటి ఘోష
వేదనను హెచ్చరికగా మారిస్తే
వితర్కించుకోవడమే మనసుకి తెలిసిన శబ్దమవుతుంది

No comments:
Post a Comment