తలుపు తెరవని మనసు గదిలోకి
కెరటాలుగా వెన్నెల కురిసిందంటే
చీకటినెవరో నిశ్శబ్దంగా తీసేసిన నిశ్చింత
చలిమంట వెచ్చదనమైనంత పులకింత
పున్నాగపువ్వులు సన్నాయిరాగానికి
ఊపిరి తడబడి సరాగపు శృతినందుకున్న
దరహాసపువీచికల నాదం
బుగ్గలపై రాసుకున్న ఓ రహస్యకవనం
గుండెచప్పుడు ఆహ్వానించిన గానానికి
నిశ్శబ్దాన్ని నెమరేస్తున్న క్షణాల ఉలికిపాటు
పెదవులు పాడని పాటలుకాగా
క్రీగంట సరఫరా అయిన తీపికారంలాంటిదీ మౌనం
ప్చ్..అదంతే..
కోటిలిప్తలు దూరమైన కోమలస్వప్నం
అదృశ్యమైన అద్భుతం మిగిల్చిన కలవరం 💕
కెరటాలుగా వెన్నెల కురిసిందంటే
చీకటినెవరో నిశ్శబ్దంగా తీసేసిన నిశ్చింత
చలిమంట వెచ్చదనమైనంత పులకింత
పున్నాగపువ్వులు సన్నాయిరాగానికి
ఊపిరి తడబడి సరాగపు శృతినందుకున్న
దరహాసపువీచికల నాదం
బుగ్గలపై రాసుకున్న ఓ రహస్యకవనం
గుండెచప్పుడు ఆహ్వానించిన గానానికి
నిశ్శబ్దాన్ని నెమరేస్తున్న క్షణాల ఉలికిపాటు
పెదవులు పాడని పాటలుకాగా
క్రీగంట సరఫరా అయిన తీపికారంలాంటిదీ మౌనం
ప్చ్..అదంతే..
కోటిలిప్తలు దూరమైన కోమలస్వప్నం
అదృశ్యమైన అద్భుతం మిగిల్చిన కలవరం 💕
No comments:
Post a Comment