పగలంతా పక్షుల కిలకిలలు, ఆకుల గలగలలు
వాటిది ఉత్సాహమో.. విషాదమో తెలీదు మరి..
ఇక్కడేమో
నీ కన్నుల్లో మధువు నా హృదయాన్ని పొంగిస్తుంటే
ఆ తీపి ఉన్మత్తానికి ఉక్కిరవుతున్నా..
మాటలు రాని పువ్వులా లోపల్లోపల నవ్వుకుంటున్నా
తెలుసా..
మంచుకురవాల్సిన హేమంతంలో వర్షం
నా మౌనానికేమో ఋతువు రాగం మార్చుకుంది
కొన్నిదోసిళ్ళ చినుకుపూలు పచ్చని సంపెంగలై కల్లోకొస్తే
నీకోసం నే రాసుకున్న భావాలనుకో
పరవశానికి రెక్కలిస్తే నీవైపుకొస్తాయేమోననే
నేనూ కనురెప్పలు మూసేసి నిద్దురకు కబురు పెట్టేసా 😊😉

No comments:
Post a Comment