Friday, 10 April 2020

// సంధ్యాదేవి //

చీకటి కౌగిలి వీడిన సంధ్యాదేవి
హేమంతపు చలిగాలిని ఆస్వాదిస్తూ మేల్కొన్నట్టుంది

వెలుగురవ్వల సుస్వరం
మౌనాన్ని ధ్వనించే పాటగా మారిన తరుణంలో
నిశ్శబ్దంగా నవ్వుతున్న పువ్వులకెన్ని కూనిరాగాలో
ఆకులపై మెరుస్తున్న ముత్యాలకన్ని రంగులు

నులివెచ్చని పసిమిఛాయనద్దుకున్న
సుప్తావస్థ పరవశం పదముగా మారి
ప్రణయ భావావేశపు కవనమై
మనోవేదపు తపన తడుముకున్న ఉదయమిది

ఆనందపు పరాకష్టలో చిందిన కన్నీటికేమో
ఎదలో చిగురించిన చెమ్మ తీపిరుచిని పోలి ఉంది ❤️

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *