Friday, 10 April 2020

// భావాల బెట్టు //

సూర్యోదయం లేని ఉదయంలో
మబ్బులు ఆకర్షించుకొని ముసురేసినట్టు
అసంకల్పిత భావాల బెట్టు

నిశ్శబ్దం మరిచిన కంటికొలనులో
అలలు నవ్వుతున్న తీరం
కన్నులు కోరుకోని స్వప్నం

పసరు వాసన లేని శిశిరంలో
నేలరాలిన పండుటాకుల పాట
ఓ అనామక స్వరానిదంట

మౌనానికి బానిసనైన వ్యసనంలో
నీ తలపులు సలిపే శూన్యానికే
నాతో నాకేమో తెగని పంతం

దాహం తీరబోని హృదయంలో
మోహపు వెల్లువ కురిసినట్టున్నా
చిల్లులపందిరి కింద చిలిపిదనమేం లేకపోగా
ముగిసేదెప్పుడో ఈ అనవసరపు వెదుకులాటనే సందేహమట..😞

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *