Friday, 10 April 2020

// వలసపోయిన తలపు //

శూన్యం మీదుగా విషాదం నాపై వాలుతుంటే
తరిమేందుకు నువ్వైతే దగ్గర లేవుగా

నీ తలపును చేరదీసిన హృదయంతో మాట్లాడాలనుకున్నా
తనెందుకో మౌనాస్వాదనలో మరోవైపుకి చూస్తుంటుంది..

పల్లవి మలుపు తిరిగి
చరణాలెటు కదిలాయో మరిచిపోయాక
నా పదాల్లో జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయనంటే
నీ కన్నుల్లో వానొస్తుందని నా భయం..

ఎదురుచూపుల ఆర్తికే కాలం కరిగి
నిన్న రేపైనంత తేలిగ్గా ఋతువు రంగు మారి
మనసుకి చలేస్తుందని తెలిసే వీలుందా నీకిప్పటికైనా..

దాచాలనుకున్న ప్రతిసారీ నేనోడిపోతాను..
ఈ కన్నులకు ప్రవహించడం తప్ప
వెలగడం నేర్పనందుకు..😣

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *