Thursday, 9 April 2020

// నిజమే..//

ఈ అనంత సాగరంలో నేనో కెరటాన్ని
విషాదాన్ని ఒడ్డుకి చేర్చాలనుకున్న ప్రతిసారీ
ఓడిపోయి గాయాన్ని అధికం చేసుకుంటున్న హృదయాన్ని

సుస్వరంతో విరితోటలందు విహరిస్తున్నట్లు కనిపిస్తున్నా
అపశృతికి తాళమేస్తూ గతి తప్పుతున్న రాగాన్ని

చంచలమైన ఊహల అంతరిక్షంలో అనురాగం అవధులు దాటిందని
అస్తిత్వాన్ని ఆవేదన పాలు చేస్తున్న పగులుటద్దాన్ని

నిజమే కదా..
గులాబీని ప్రేమించినంతగా ముళ్ళను ప్రేమించేదెవరు
ఈ జన్మకీ మోహం చాలునేమో..
మౌనాన్ని ఔపాసన పట్టాలిప్పుడు కొత్తగా 😣

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *