ఏకాంతానికి జారిపోయి చాలా కాలమైందనే
నీ చూపుల అల్లికలో అందంగా ఒదిగి
కరుగుతున్న చలికాలంలా ఒణుకుతున్నా
గుప్పెడు పదాలుగా రాసుకున్న మాలికలు
వలపు దారంతో ముడేసుకున్న భావనలు
మంచుపూసల మెరుపుకలలుగా దాచుకున్నా
లిపిలేని మనోవ్రతం మొదలైన మనసులో
చిలుకుతున్న క్షణాలకెన్ని కవ్వింతలూరాయో
నన్ను నీ ప్రేమలేఖగా మార్చేసుకున్నా
వెచ్చగా రాసుకున్న పులకింతల తుంపరలు
నీ పెదవులపై అలలుగా ఊహించేందుకే
గుండెల్లోని ఆర్తినంతా ఎప్పటికప్పుడిలా పంచేస్తున్నా..😍💜
నీ చూపుల అల్లికలో అందంగా ఒదిగి
కరుగుతున్న చలికాలంలా ఒణుకుతున్నా
గుప్పెడు పదాలుగా రాసుకున్న మాలికలు
వలపు దారంతో ముడేసుకున్న భావనలు
మంచుపూసల మెరుపుకలలుగా దాచుకున్నా
లిపిలేని మనోవ్రతం మొదలైన మనసులో
చిలుకుతున్న క్షణాలకెన్ని కవ్వింతలూరాయో
నన్ను నీ ప్రేమలేఖగా మార్చేసుకున్నా
వెచ్చగా రాసుకున్న పులకింతల తుంపరలు
నీ పెదవులపై అలలుగా ఊహించేందుకే
గుండెల్లోని ఆర్తినంతా ఎప్పటికప్పుడిలా పంచేస్తున్నా..😍💜
No comments:
Post a Comment