ఎప్పుడూ నడిచే దారుల్లోనే పూలు చల్లుతున్నారెవరో..
క్షణానికో పరిమళాన్ని పసిగడుతున్న మేను
అదుపు తప్పొద్దని హృదయానికి చెపుతూనే ఉన్నా
నాలో నన్ను మొలకెత్తించేలా చేసే నీ అలికిళ్ళు
ఎదలో మౌనాన్ని కొలుస్తున్నప్పుడు
పెదవుల్లో చిరునవ్వులు రచిస్తుంటాను
మాటలు కరువైన మన మధ్య
కవితలు రాయబారం నడిపితే
నిద్దురకు చోటెక్కడుంది
కలల వెంటబడ్డ కన్నులకు అలుపే గానీ
రాజీ చేసేందుకొచ్చిన చీకటికీ
మోజులు రేపగలదుగా గడుసుదైన రాతిరి..
క్షణానికో పరిమళాన్ని పసిగడుతున్న మేను
అదుపు తప్పొద్దని హృదయానికి చెపుతూనే ఉన్నా
నాలో నన్ను మొలకెత్తించేలా చేసే నీ అలికిళ్ళు
ఎదలో మౌనాన్ని కొలుస్తున్నప్పుడు
పెదవుల్లో చిరునవ్వులు రచిస్తుంటాను
మాటలు కరువైన మన మధ్య
కవితలు రాయబారం నడిపితే
నిద్దురకు చోటెక్కడుంది
కలల వెంటబడ్డ కన్నులకు అలుపే గానీ
రాజీ చేసేందుకొచ్చిన చీకటికీ
మోజులు రేపగలదుగా గడుసుదైన రాతిరి..

No comments:
Post a Comment