నాకు మాత్రమే వినిపించే పాట..
కొన్ని చినుకులు కురిసిన పరిమళంలా నాలో
మౌనాన్ని కప్పుకు తిరిగే శీతాకాలపు రాత్రి
రెండు మనసులు మాట్లాడుకున్న ఊసులో
చల్లగాలికి ఉక్కబోసినట్టు
క్షణానికో తలపు చుట్టుముట్టి
జన్మజన్మల నిరీక్షణ అంతమై
అరుదైన అనుభవానికి చేరువవుతున్నట్టు
రాసలీఫియా పువ్వుల రాగం
లోలోపల పుప్పొడి చల్లి
వసంతానికి తపించినట్టు
కవిత్వమైపోవాలనిపిస్తుందిప్
నన్నో కల్పనగా చేసి
నీ నిశ్శబ్దాన్ని పూరించుకుంటావని..

No comments:
Post a Comment