అదో నింగీ నేలా కలుస్తున్నట్లనిపించే దృశ్యం
అక్కడంతా సంగీతం వినిపిస్తుంది
అలను మరో అల ముద్దాడినట్లుంది
మనసంతా అమృతం నింపుతానంటూ
చేయి చాచి రమ్మని నన్ను పిలుస్తోందెందుకో..
మౌనం మంత్రమేసిన పున్నమి క్షణాల్లో
గుండె ఝల్లుమంది
ఇప్పుడే ప్రాణం పోసుకుంటున్నట్లు మునుపులేని చలి
అయినా ఊహించలేనంత ప్రశాంతత ఈ వెన్నెల్లో
ఈలోగా రంగులు మార్చుకున్న ఆకాశం
ఒక జీవన స్పర్శతో వెచ్చగా తడమింది
వాస్తవంలోకి నడిచేందుకు వేళయ్యింది పదమంటూ..
:)

No comments:
Post a Comment