ఆగని చెలమల ఆ కన్నులమాటు
స్వప్నాలు కరువైన కొన్ని రాత్రుల యాతనలో
చిరునవ్విప్పుడు చేదయ్యింది
జీవితపు స్వరూపం రంగులు మారి
నమ్మకపు భంగమై అహాన్ని ఎదుర్కోలేక
నిర్లిప్తతను చేరదీసింది
తరచి చూసిన హృదయంలో
తారుమారైన ఆనందవిషాదాలు
సహజత్వాన్ని బలహీనం చేసాయి
భావతరంగాల్లోని చైతన్యం
మౌనాన్ని మోహించడమెప్పుడు నేర్చిందో
ఇప్పుడీ ఏకాంతం పూర్తిగా అసంతృప్తిమయం
ఈ నిశ్శబ్దాన్ని తట్టి చూస్తే దాని సంగీతం శోకతప్తం..

No comments:
Post a Comment