మొన్న కూర్చిన స్వరానికిప్పుడో లయ కుదిరింది
రాగం మొదలైన మధుర థ్వని
పదనిసలొలుకుతూ మనసంతా ఊగింది
అణువణువూ పరవశమై రేగే పరిమళాల భాష్యాలకు
ఊపిరిలో వెచ్చదనం నిండింది
అధరాల పగడపు రంగు బుగ్గలకు పాకింది
ఆత్మానందపు అన్వేషణలో
కొన్ని క్షణాల మౌనవసంతం
ప్రేమఋతువుకదో నవలోకం
నరనరాన ఉప్పొంగు సంతోషం
ఊదారంగు పువ్వుల్లో
రహస్యంగా దాచుకున్న ప్రియానుభావం
నీ కౌగిలి వెన్నెల్లో తడిచిన సంగతి
వేకువ దుప్పటిలో ఆవిర్లు నిండిన అనుభూతి
ఊహల తన్మయత్వమిప్పుడు మత్తుగా సోలిన భావుకత్వపు లాలితం..

No comments:
Post a Comment