Sunday, 23 July 2017

//అదే మర్మమో..//



అనుకుంటూనే ఉన్నా..
అనుబంధమేదీ లేకుంటే నన్ననుసరించే వాడివే కాదని
ఆరాధనంటూ లేదంటే నీ రాధనే నేను కానని
తలవాల్చి నే నిలిచిన వేళ వెన్నెల రాశినే కుమ్మరించావు
పున్నమొచ్చిందని పులకరించేలోగా పుష్యమివై కదిలిపోయావు..
నిరంతర నీరవంలో నిస్సహాయమైన నన్ను నిద్దురలేపావు
పెదవి ముడి విప్పేలోగా నాలో సంగీతాన్నే దోచుకెళ్ళావు
చెమ్మగిల్లిన నయనాలకు నవ్వడమెలాగో నేర్పించావు
కదిలే కలనై నిన్ను చేరేలోగా తెమ్మెరవై తరలిపోయావు
మలుపులు తిరిగే సన్నజాజి తీగకు పందిరిగా కనిపించావు
అల్లుకొనేలోపు అంతరిక్షం నేనంటూ అంతర్థానమయ్యావు

నిప్పుల ఉప్పెనై మది మండినప్పుడు ఊహల వెల్లువలో చల్లగా ముంచుతావు
ఆశల అంచులు దాటొచ్చేలోపు వాస్తవమై వెక్కిరిస్తావు
ప్రతీక్షణం నీ ప్రతీక్షణలో నేనుంటా అడవి కాచిన వెన్నెలనై
అప్పుడప్పుడూ అలక తీర్చేందుకని వస్తుంటావ్ నువ్వేదో మంత్రమైనట్టు..!!


1 comment:

  1. నమస్తే అమ్మ మీ బ్లాగ్ మా ప్రతిలిపి టీం కి ఫార్వార్డ్ చేసాను మీ బ్లాగ్ లో ఉన్న రచనలు అన్ని మా వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేయడం జరుగుతుంది.మీ నెంబర్ మిస్ అయ్యింది వీలైతే ఒక్కసారి కాల్ చేయండి.

    ReplyDelete

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *