Saturday, 31 October 2020
// మార్పు //
ఎప్పుడూ తన మాటే చెల్లాలనుకొనే జీవితం
దారులన్నీ మూసేసి మార్పు అనివార్యమంటుంది
మౌనాన్ని కౌగిలించిన గడ్డిపువ్వులా మారిపోయాక
నక్షత్రాల కోసం నిరీక్షణ ఆగిపోతుంది
గాయాల్ని రేపే గతం మనసుని సాంత్వనో
వెన్నెలనీ నలుపు చేసే చీకటో తెలియకనేమో
నేల తడిచే నాలుగు రోజులూ
కలవరింతలు వానై కురుస్తుంటాయి
రెప్పలకు కునుకెందుకు లేదో అనుకోరాదప్పుడు
వెతలకు మూగసాక్ష్యంగా కన్నులూ తడుస్తున్నప్పుడు 😣
Friday, 30 October 2020
// ఆ దారి //
ఆ దారి ఎడారి వైపుకని
తెలిసే నువ్వు పయనం మొదలెడతావ్
అక్కడో పలకరింపు లేదని
నీకు నువ్వే దహించుకుపోతావ్
ఎవ్వరినీ తోడు రానియ్యవూ
ఆగి కాసేపు ఆలోచించవూ
మాటలు దాచుకున్న మౌనం నువ్వు
మూగపుస్తకంలా నిన్ను చదువుకోవాలి
నిన్ను ప్రశ్నించాలంటే అసహనానికి సిద్ధమవ్వాలి
మానసికంగా మాత్రమే నువ్వని మది తలుపేసుకోవాలి..😣
Wednesday, 7 October 2020
// సంధ్యారాగం //
పంచభూతాల్లో కలిసిపోయే పంచప్రాణాలు
ఈ రోజుకి చైతన్యం..రేపటికి నిర్జీవం
నీ కంటి మెరుపులో నా ప్రతిబింబం
మాత్రమెప్పటికీ పదిలం..
నేలకు రాలిన పువ్వులు చిరునామా మార్చుకొని
మట్టికి పరిమళాన్ని పంచినట్టు
మనసు వాసన తెలిసిన నీకు
నా ఉనికి నీతో కదిలే సజీవ లక్షణం..
చీకటిలోనో..ద్వీపంలోనో నువ్వొంటరి కావు
వాస్తవాన్ని భూతద్దంలో చూడకు
రేపటి వెన్నెలను ఈరోజు ఊహిస్తేనే
నీకు నువ్వో దిక్సూచివి
అవధులు దాటే కాలంతో పోటీపడి
చిరునవ్వుని గతంలోకి తోసేయకు
ఆశలు రేకెత్తినప్పుడే సూర్యోదయం అందం
పూలగాలి సోకితేనే అది సంధ్యారాగం 💜💕
// గాల్లో దీపం //
పొద్దుగుంకేలోపు జీవితాన్ని మజిలీకి చేర్చాలన్న ఆవేశపు నడక ముగిసేదెన్నడో
దారిపొడవునా ఓర్చిన కష్టాల ఎదురీతలు, అసహాయ మూగబాధలకు విముక్తి ఎప్పుడో
మిణుక్కుమన్న ఆశ ఆసరాతో మొదలైన గమనం..గాయమైనా..ఫలించేది ఎందరికో
బ్రతుకు బరువు మోయలేని అంధకారంలో అకారణన ద్వేషాన్ని జయించి సజీవులయ్యేదెందరో
ఇన్నాళ్ళూ ముడుపుగట్టి దాచుకున్న ఆరోగ్యం గాల్లో దీపమయ్యాక..దుఃఖమవని క్షణాలెక్కడని వెతకాలో 😞
కొత్తగా మరోసారి "నడత" నేర్చుకునైనా వర్తమానాన్ని కాపాడుకుందాం
అనివార్య నిశ్శబ్దానికని .. ఘనీభవించిన కాలానికి చలనమొచ్చింది కనుక
ఏమరుపాటునొదిలి ఈ యాదృచ్ఛికానికి ఎదురీదగలిగినోళ్ళకే విజయమని గుర్తుపెట్టుకుందాం.!!
Friday, 2 October 2020
// నువ్వంటే ఇదేగా //
అనుభవాల్ని దాచుకున్న నుదురు
నుదుటిగీత మెరుపులు మహాకాంతులు
వెన్నెలను పరితపించే కళ్ళు..
కళ్ళు విచ్చుకున్న మల్లెలు
పరిమళానికే తడబడు నాసిక
నాసిక నింపుకున్న వెచ్చనిశ్వాసలు
మౌనముద్రలో మృదు చెక్కిళ్ళు
చెక్కిళ్ళు దాచుకున్న నవ్వులు
అనంత పరవశాల పెదవులు
పెదవులు పలుకుతున్న స్వరాలు
ఆకాశమంత సువిశాల మనసు
మనసు చల్లని మాటలు
కాలాన్ని ఆలకిస్తున్న చెవులు
చెవిలో హోరెత్తు మురిపాల కెరటాలు
చలువపందిరి వేసిన నల్లమబ్బు
మబ్బుతెరల మాటు చంద్రుడు
నువ్వంటే ఇదేగా 😎💜
Thursday, 27 August 2020
// మనసు చేసే గారడీ //
నిశ్శబ్దానికి అందంగా స్పందిస్తూ
రసమయ దారుల్లో సాగునప్పుడు
ఊగిసలాడుతూ మనసు చేసే గారడీ
స్రవించే చీకటిని గమనించదు
కలలో ప్రతికొమ్మా కబుర్లు చెప్పేదే
వెన్నెల కౌగిలిలో వెతలు మరిపించేదే..
గులాబీల గాలికి ముక్కు మూసుకొనే
ఆడంబరం ఓ ఆత్మాభిమానమయ్యాక
ఉక్కిరిబిక్కిరి అవ్వడమే సహజమప్పుడు
అయినా..
పగిలిన నవ్వులకు లేపనం పూసుకోడం
తెలియని పెదవులకు చెప్పేదేముందని..
పదాలలో ప్రణయకాంక్ష గుప్పించినంత
తీపి కాదు జీవితం
వగరు వేదాంతమూ కలగలిసినదీ
వైచిత్రి మూలమని నీకూ తెలిసినప్పుడు 💜
Saturday, 13 June 2020
// హృది //
మెరుపూ మేఘమూ కలిసినదీ హృది
దశదిశల ఉప్పెనై చెలరేగు వర్షమిది
స్వర్గద్వారాల స్వరపల్లవుల నెలవీ హృది
కనుకొసల నిలిచిన బిందుకేంద్రమిది
రాగఝరికీ అనురాగసిరికి దాసోహమీ హృది
వేయివసంతాల అపురూప సౌందర్యనిధి
ఏకాంతపు రసవాహిని ఒరవడీ హృది
పూదండై పరిమళించు కవనమిది
సాహితీ వనమాలీ..నిజమిది..
శిధిలాల నుండి బయటపడ్డ పచ్చని శిల్పమిది..
Friday, 29 May 2020
// రోహిణి..//
నిలబడ్డచోట నిప్పులగుండం
అనంతమైన సెగలుచిమ్ముతూ
ఉడుకు వాసనేస్తుంది
కరిగి నీరవుతూ దేహం చేస్తున్న
హాహాకారానికే గొంతెండిపోతుంది
వేసవిగాలుల దాడికి నిద్రాసనంలో సొమ్మసిల్లి
ఎండపొడకి మొరాయిస్తున్న
ఆత్మను నిద్రలేపున్న విఫలప్రయత్నంలో
కొంత అనివార్యపు యుద్ధమవుతుంది
కాలాన్ని కత్తిరిస్తున్న రోహిణికి
పగులుతున్నవి రోళ్ళు మాత్రమేనా
సకల జీవరాసీ ప్రాణాలొడ్డి ఓర్చుకుంటున్న తాపం
ఏటేటా పెరుగుతున్న భూభారపు ముఖచిత్రం
తప్పని తెలిసీ దిద్దుకోలేని మన చేతకానితనం
రాబోవు తరాలకు మనమందిస్తున్న కాలుష్యపు భవితవ్యం 😞

// శిలాజలమైపోవద్దని..//
వైశాఖం వంతెన దాటేలోపే
కొన్ని కలల చిత్రాలను నాకొదిలేసింది
ఎదలో కవిత్వాన్ని ఆపేసి శిలాజలమైపోవద్దని
మాట తీసుకొని మరీ కదిలింది
నన్ను దాటిపోయిన చిరునవ్వులు
నీవైపొచ్చాయేమో అడగాలనుకుంటానా..
కాగితమంతా నీ పాదముద్రలతో కనికట్టు చేస్తూనే
చాలాసార్లు అదేమో క్లుప్తంగా ఉండిపోతావ్
నీ పేరు మౌనమని
రెప్పలమాటు అలలు విరిగిపడుతున్నా
అమాస కదా అనే ఆశావాదానికి నిర్వచనానివని
నాకు తెలిసిపోయాక ఇంకేమడగనూ..
అలవాటైన మనసుపాటలో ఐక్యమయ్యి
అంతరంగ పయనంలో సాగిపోతున్నా..
దారంతా నీలినీలి పువ్వులు
ఏరుకోమనే నీ భావాలకు మల్లేనే..😂💜

// వేకువ చుక్కలు //
నవ్వే నీ కళ్ళు వేకువ చుక్కలు
నన్ను మేల్కొలిపే దీపాలు
నా అందమైన ఊహాలోకానికి వారథులు
ఏకాంతపు కలల ప్రాకారాలు
మేఘాలకొసకు పుట్టిన మెరుపులు
విరజాజి రేకుల్లో పాలదొంతరలు
నీ సమస్త భావాల ప్రకంపనలూ
నన్ను నీలో కలిపేసుకున్న భాష్యాలు
ప్రేమాన్వీ..
నీ చూపుల తాదాత్మ్యాలే
నే నిరంతరం పేర్చుకొను పదాలు
అవి ఎగిసిపడే అలల వెన్నెలపొరలైతే
మనసంతా అత్తరు ప్రవాహాలు
తొలివలపు లాలస మేలిముసుగులో
నన్ను రగిలించే చిలిపి మోహపుధారలు 💕💜
నన్ను మేల్కొలిపే దీపాలు
నా అందమైన ఊహాలోకానికి వారథులు
ఏకాంతపు కలల ప్రాకారాలు
మేఘాలకొసకు పుట్టిన మెరుపులు
విరజాజి రేకుల్లో పాలదొంతరలు
నీ సమస్త భావాల ప్రకంపనలూ
నన్ను నీలో కలిపేసుకున్న భాష్యాలు
ప్రేమాన్వీ..
నీ చూపుల తాదాత్మ్యాలే
నే నిరంతరం పేర్చుకొను పదాలు
అవి ఎగిసిపడే అలల వెన్నెలపొరలైతే
మనసంతా అత్తరు ప్రవాహాలు
తొలివలపు లాలస మేలిముసుగులో
నన్ను రగిలించే చిలిపి మోహపుధారలు 💕💜
//ఇటు తిరుగకు..//
కొసరి కొసరి మైమరచిపోయేంత అశాంతి
గుండెల్లో అలల మాదిరి జలజలలో
సందిగ్ధమైన స్పర్శ నీ తలపుదేనా
ఆకాశానికి వెన్నెల హారతి పడుతున్న వేళ
గాలి తునకలు మోసుకొస్తున్న పరిమళానికి
నిదురన్నది రాని రాత్రి ఈ పంచాశ్రువులెందుకో
అతులితానంద కన్నీటి రాగంలో
రెక్కలు తొడగలేని ఆత్మగీతం
ప్రతిధ్వనిస్తున్న పర్వం అవేదనదా..
జీవనవేదపు ప్రవాహవెల్లువలో
తడవని తామరాకులా ..నువ్వో అన్వేషివి
వసంత విరితావులా నేను..నీ వెనుకడుగుని..
ప్రేమాన్వీ..
ఇటు తిరిగి నన్ను పరామర్శించకు
నే పరితపించిన పాటకి గొంతు కలుపుతూ పద ముందుకు..💕💜

Wednesday, 6 May 2020
// చెప్పేదేముంది..//
చెప్పేదేముంది
రోజూలానే ఉదయమయ్యింది
వేకువ కన్నుతెరిచి
మృదువైన కోలాహలాన్ని తెచ్చింది
గుర్తుతెలియని రాగాలు రెక్కలిప్పుకున్న గువ్వలై
పూల తెమ్మెర పదాలు సహా
జీవనగీతం వినిపిస్తున్నాయి
కానీ
చిరునవ్వుకి కారణం వెతుకుతున్న సమయమిది
కన్నీటితెర వెనుక జ్ఞాపకాల పారవశ్యాలు
దిగులుమేఘపు కవిత్వాన్ని పాడమంటున్నా
ఊపిరాడనివ్వని ఉక్కబోత
ఒక్క కలనీ తొడుక్కోనివ్వలేదు
వసంతానికీ విషాదం తెలుసనుకుంటా
అంతర్లోకపు నిరసనేదో నిశ్శబ్దాన్నే కోరుతున్నట్టు
గొంతు సవరించినా అపస్వరాలు
తలపుని కలుపుకోలేకపోతున్న కాలం
అలలు నెమ్మదిస్తున్నట్లనిపిస్తున ్న గుండెసముద్రం 😣
రోజూలానే ఉదయమయ్యింది
వేకువ కన్నుతెరిచి
మృదువైన కోలాహలాన్ని తెచ్చింది
గుర్తుతెలియని రాగాలు రెక్కలిప్పుకున్న గువ్వలై
పూల తెమ్మెర పదాలు సహా
జీవనగీతం వినిపిస్తున్నాయి
కానీ
చిరునవ్వుకి కారణం వెతుకుతున్న సమయమిది
కన్నీటితెర వెనుక జ్ఞాపకాల పారవశ్యాలు
దిగులుమేఘపు కవిత్వాన్ని పాడమంటున్నా
ఊపిరాడనివ్వని ఉక్కబోత
ఒక్క కలనీ తొడుక్కోనివ్వలేదు
వసంతానికీ విషాదం తెలుసనుకుంటా
అంతర్లోకపు నిరసనేదో నిశ్శబ్దాన్నే కోరుతున్నట్టు
గొంతు సవరించినా అపస్వరాలు
తలపుని కలుపుకోలేకపోతున్న కాలం
అలలు నెమ్మదిస్తున్నట్లనిపిస్తున
// కన్నీటికథల రహస్యం //
దీర్ఘనిశ్వాసకే ఆరిపోయే దీపంలా
రెపరెపలాడుతూ ఊగుతున్న ఉరికొయ్యలా
కాలంలో ఎప్పుడు కొట్టుకుపోయిందో
కౌగిలింతకూ నోచుకోని కాగితంపువ్వు జీవితం
చీకటితో గొడవపడుతున్న సమయంలో
కలలపై నిర్మించుకున్న వంతెన విరిగి
కనుకొలుకుల్లో ఇసుకమసి నింపి
చివరి అంకపు పరాచికాన్ని ఆడనివ్వని అంతర్వేదం
తడిమి చూసుకున్నా సంతోషం తగలని నిస్సహాయమే..
శాపాన్ని వెంటేసుకొచ్చిన శూన్యాకాశం
ఓదార్పు సైతం కూడదీసుకోలేని నిట్టూర్పుల్లో
ఎవ్వరికీ తెలియని కన్నీటికథల రహస్యం 😣

// అడగాలని ఉంది..//
నిశ్శబ్దాన్ని రాల్చుతున్న ఆకాశానికెంత కష్టమొచ్చిందో
నిచ్చెనమెట్ల మీదుగా ఆరాతీసినా దాని గొంతే వినబడనట్లు
కలలు పారేసుకున్న దారిలో ఎంత దూరం నడిచినా
ఆద్యంతం లేని విషాదం మాత్రం వెనుకే వస్తుంది
అన్ని సీతాకోకలకి రంగులేసేంత ఓపికున్న దేవుడికి
నన్నెందుకు చిమటగా మిగిలించాడో వెతికి అడగాలని..
రెక్కలొచ్చినప్పుడంతా కిటికీలోంచీ ఎగరాలనుకుంటానా
గాలొచ్చి గాయాన్ని గుర్తుచేసి మరీ జోకొడుతుంది
ఇంత చెప్పినా నువ్వేం నమ్మవుగానీ..
అందానికి అవతలున్న ప్రతిబింబం తెలుసా నీకు
ఆ రెప్పల కింద సముద్రముందని తెలియాలంటే
నా చెక్కిలి రుచి చూడవలసిందే నువ్వొకసారి 🙂

// అంతర్ముఖం.//
పలుకు బంగారమైన చోట
ఆరాటపడే హృదయమేదీ చిరునవ్వదు
మాట మనసుల్ని దగ్గర చేస్తున్నప్పుడు
దానికి ప్రత్యామ్నాయం ఏముందని..
అక్షరాలకు చినుకులుగా మారడం తెలుసు కనుకనే
కురిసి హృదయాన్ని తడపడం నచ్చదు
మనిషి లోపలి మనిషిని తట్టిలేపలేని
ఘనీభవించిన రాచరికపు స్నేహాలు ఎవ్వరికోసమని..
మౌనం ముసుగేసుకున్న కెరటం తీరాన్ని తాకలేనట్టు
అనురాగం ఆవిరైన మేఘం తొణికేదెన్నడో చెప్పలేరెవ్వరూ
కృష్ణపక్షపు చంద్రుని ముఖచిత్రమే..
కరిగిపోతున్న అనుబంధపు అంతర్ముఖం..😣

// జ్ఞాపకాల గది //
పాడుతూ ఉన్న మది పాడవుతుందని తెలిసినా
జ్ఞాపకాల గది వీడి బయటకీ రాదు
ప్రణయాక్షరాలను పేర్చడమూ ఆపదు
నా నాలుగు క్షణాల నిత్యానందాలు
కెరటంలో దాగిన కడలిలా
నీలోపలున్నాయని తెలిసాక..
ఇష్టమంటూ నువ్వు మిగిల్చిన మౌనంలో
ముత్యాల తుంపరలెన్నో
ఊపిరాడనంతగా తడిచిపోతున్నానిలా
సంతోషాన్ని నెమరేస్తూ జరుపుతున్న కాలహరణంలో
లోనికి ఇంకడం తెలియని కన్నీరు
మంచి ఘడియలకి ఎదురుచూస్తున్నట్టు
ఏకాంతం చేసే వినోదానికి నవ్వడం నేర్చుకుంటుంది
ఊహకందని నిశ్శబ్దమేదీ మన మధ్య లేనందుకే
తెరతీయకుండా నువ్వు పలుకుతున్న పదాలనే నేనాలపిస్తున్నా 😉💜

// ప్రత్యేకమైన రోజులివి //
దేశదేశాలూ పశ్చాత్తాపంతో పయనమాపేసినప్పుడు
తొలిసారి ఊపిరి పీల్చుకుంటున్న విశ్వాన్ని చూడు
వేకువ చుక్కలదండ వేసుకున్న వేసవిలో
కొన్ని యుగాల పులకరింపుని
అరమోడ్చిన కళ్ళతో
అద్దంలో చూసుకుంటుంది ప్రకృతి
మేఘాల మెరుపూ..కోయిల పిలుపూ
ఊహల విరుపూ..బుగ్గల ఎరుపూ
వివశించక తప్పని వింత అధ్యాయపు
ప్రతీదీ ప్రత్యేకమైన రోజులివి
కాలుష్యపు వలువలు వీడిన లోకం
రంగురంగుల చిలిపినవ్వుల మైకంతో..
అడివిగాలి ఆకాశంలో దారితప్పి ఇటొచ్చినట్టు
మనసంతా మరుమల్లె సువాసనా సందళ్ళు
ఇప్పుడెవరూ సుప్రభాతం పాడక్కర్లేదు
ఆశలద్దుకున్న అనుభూతులతో కళ్ళవే విచ్చుకుంటాయి 💜

// కాలం //
అపారమైన శక్తి కలిగిన కాలం
కోట్లానుకోట్ల క్షణాల కౌగిలికి పుట్టిన నిజం
జీవితాన్ని శాసిస్తూ తను మాత్రం కదిలిపోవు దూరం
ఆద్యంతాల అనుభవాలను కనికట్టు చేయగలుగు వేదం
గుండెలమాటు అశను తీర్చగలిగే ప్రణవనాదం
మనసుపడ్డ కవితలా రంజింపజేయు దరహాసం
శిలను శిల్పంగా మలచగల నిశ్శబ్ద గమనం
రెప్పలమాటు నులివెచ్చని కన్నీటిని తీపి చేయగల సాక్ష్యం
యుగయుగాల అవకాశావాదుల కాలక్షేపం
ద్వేషం చేసిన మాయని గాయానికి మంత్రం
అవధుల్లేని విషాదాన్ని మరిపించు నవరాగం
నిర్లక్ష్యపు ఆఖరివాక్యాన్ని క్షమించు ఔదార్యం
అనుకోని మలుపులా ఎదురొచ్చి హత్తుకోగల కెరటం
ఊహించని ఉప్పెనలానూ ముంచగలదీ శూన్యం
విశ్వం దాకా విస్తరించిన అదృశ్య చరిత్ర పుటం
నమ్మగలిగితే నిత్యస్ఫూర్తినిచ్చు కన్నుల్లో దైవం 🙏💜

Wednesday, 15 April 2020
// పరాయి రాగం //
కళ్ళు తెరిచినా చీకటిగా ఉందంటే
మనసు సాయం చేయట్లేదనేమో
ఆనందం పరాయిరాగమై పలకరించకుండానే పోతుంది
ఒక్క కలా కొత్తదారిలో నడవలేనప్పుడు
ఎన్ని రాత్రులు నిదుర కరువైతేనేమి
// శార్వరి //
నిషాకళ్ళ మైమరుపుతో..నేరేడుపండు మెరుపుతో
శార్వరి నడిచొస్తుంది..
నల్లని కనుబొమ్మలూ..నీలి కేశాలతో
మత్తు చల్లుతూ కులాసాగా కదిలొస్తుంది..
చీకటి అందంలో వెన్నెల స్వప్నంలా
నీలాంబరి రాగానికి నీలిగంటల తాళమేస్తూ
క్షణాల కోలాహలంలోని కాలస్పందనలా
చైత్రరథంపై చిరుదీపాన్ని చిదుముకొస్తుంది
నిర్లిప్తపు ఆశలన్నీ నిశ్శబ్దాన్ని ముడేసుకోగా
నీలివాని దేహపు నెమలిపింఛం
నిమురుకున్నంత మెత్తగా
నిషిద్ధరాత్రిని ప్రేమించమంటుంది
ఈ నిశీధి శాశ్వతమేం కాదుగా..
ఎంతకని ఆత్మకథలు రాసుకుంటాం
రా..ఏకాంతాన్ని పగలగొట్టుకొని
జన్మమాధుర్యాన్ని కలిసి పాడుకుందాం..

Corona 3
కనిపించని శత్రువుతో యుద్ధం..
జీవితం అనివార్యమిప్పుడు
అనుబంధాలు అమూల్యమైనందుకు
సరికొత్త ప్రమాదపు హెచ్చరికను
బేఖాతరు చేయలేక
గెలిచి తీరాలన్న పట్టుదలను పెంచుకుంటూ
కాలం రాస్తున్న పరీక్షిది
క్షణానికో ప్రశ్నకి జవాబు వెతకలేక
ఒంటరితనానికి హద్దులు గీస్తూ
ప్రశాంత పోరాటాన్ని ప్రోత్సహిస్తుంది
నాకుగా ప్రాణం తీపి కాదు
నావాళ్ళని అంతర్ధానం చేసుకోలేక
ఏకాంత అజ్ఞాతానికి సిద్ధమవక తప్పలేదందుకు
ReplyForward
|
violence in Delhi
Condemn d violence in Delhi
మొదలెట్టిందెవరో మారణహోమం..
మృత్యువును తమాషా చేస్తున్న ఉన్మాదం..
ఒకరినొకరు ఎందుకు చంపుకోవాలో కూడా తెలియని విద్వేషం
కన్నీళ్ళకు కొదవలేక మిగిలి..
ఓదార్పు కరువై ఊపిరిని ఒగొర్చుకుంటున్న మౌనసాక్షులు కొందరైతే
తెలియని కక్షని తలకెత్తుకున్న మూర్ఖులు కొందరు
చిమ్ముతున్న ద్వేషం దేశాన్ని గాయపరిచాక
ఘనచరిత్రదేముంది గర్వకారణము
మతమూ..వంశమూ పరిథిగా మారాక
విశ్వమూ ఓ కూపస్థమండూకము 😠

// కలలతడి //
దిక్కుతోచని ఏకాంతాలు
నన్ను పరిహసించేందుకు నల్లమబ్బులై
వానకారు కోయిలలకు కబురెట్టాయి
మంచులో తడిచిన మల్లెపువ్వు వణుకులా
ఈ పొద్దు నాలో మోహనరాగం
నిన్ను కలవరించేందుకే కమ్ముకుంది
// నిట్టూర్పు //
ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ
చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు
నల్లనిమబ్బులమయమైన ఆకాశం
మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది
// వానంటే..//
అవును
అప్పుడప్పుడూ కురిసేదే అయినా
వానంటే అదో ఇష్టం నాకు
కొన్ని జ్ఞాపకాలు తీపి మిఠాయిలు కాకపోయినా
జీవితాన్ని చేదు కాకుండా ఆపిన వగరుపళ్ళు
తలుపు తీసుకురావడమే
స్వేచ్ఛనుకుంటే..
నన్ను కాదని నేను తప్పించుకు తిరగలేకనే
ఎదురుపడుతున్న నిశ్శబ్దాన్నీ
సంగీతంగా మార్చుకున్నాను
Monday, 13 April 2020
// అలిగిందెవ్వరో //
కనురెప్ప వేయడం మరిచింది కన్ను
హృదయమొలికితే ఆపలేనని తెలుసుకున్నట్టు
నిద్రనేదే రాని ఈ కాలానికి పేరేం పెట్టాలో
మౌనాన్నాపే ఇష్టమైన మాటేదీ తెలీనప్పుడు
అలిగిందెవ్వరో నువ్వు తీసే ఊపిరికి తెలుసేమో
నేనెదురుపడ్డా నా వాసన గుర్తించలేవిప్పుడు
అసలు గాయాన్ని ప్రేమించే ధైర్యమెవ్వరికుంటుందని..
ఇవ్వలేని వారికీ ఇవ్వగలిగిందే ప్రేమని తెలీనప్పుడు..💜

// విశ్వాన్ని చూడు //
దేశదేశాలూ పశ్చాత్తాపంతో పయనమాపేసినప్పుడు
తొలిసారి ఊపిరి పీల్చుకుంటున్న విశ్వాన్ని చూడు
వేకువ చుక్కలదండ వేసుకున్న వేసవిలో
కొన్ని యుగాల పులకరింపుని
అరమోడ్చిన కళ్ళతో
అద్దంలో చూసుకుంటుంది ప్రకృతి
మేఘాల మెరుపూ..కోయిల పిలుపూ
ఊహల విరుపూ..బుగ్గల ఎరుపూ
వివశించక తప్పని వింత అధ్యాయపు
ప్రతీదీ ప్రత్యేకమైన రోజులివి
కాలుష్యపు వలువలు వీడిన లోకం
రంగురంగుల చిలిపినవ్వుల మైకంతో..
అడివిగాలి ఆకాశంలో దారితప్పి ఇటొచ్చినట్టు
మనసంతా మరుమల్లె సువాసనా సందళ్ళు
ఇప్పుడెవరూ సుప్రభాతం పాడక్కర్లేదు
ఆశలద్దుకున్న అనుభూతులతో కళ్ళవే విచ్చుకుంటాయి 💜
తొలిసారి ఊపిరి పీల్చుకుంటున్న విశ్వాన్ని చూడు
వేకువ చుక్కలదండ వేసుకున్న వేసవిలో
కొన్ని యుగాల పులకరింపుని
అరమోడ్చిన కళ్ళతో
అద్దంలో చూసుకుంటుంది ప్రకృతి
మేఘాల మెరుపూ..కోయిల పిలుపూ
ఊహల విరుపూ..బుగ్గల ఎరుపూ
వివశించక తప్పని వింత అధ్యాయపు
ప్రతీదీ ప్రత్యేకమైన రోజులివి
కాలుష్యపు వలువలు వీడిన లోకం
రంగురంగుల చిలిపినవ్వుల మైకంతో..
అడివిగాలి ఆకాశంలో దారితప్పి ఇటొచ్చినట్టు
మనసంతా మరుమల్లె సువాసనా సందళ్ళు
ఇప్పుడెవరూ సుప్రభాతం పాడక్కర్లేదు
ఆశలద్దుకున్న అనుభూతులతో కళ్ళవే విచ్చుకుంటాయి 💜
// కాలం..//
అపారమైన శక్తి కలిగిన కాలం
కోట్లానుకోట్ల క్షణాల కౌగిలికి పుట్టిన నిజం
జీవితాన్ని శాసిస్తూ తను మాత్రం కదిలిపోవు దూరం
ఆద్యంతాల అనుభవాలను కనికట్టు చేయగలుగు వేదం
గుండెలమాటు అశను తీర్చగలిగే ప్రణవనాదం
మనసుపడ్డ కవితలా రంజింపజేయు దరహాసం
శిలను శిల్పంగా మలచగల నిశ్శబ్ద గమనం
రెప్పలమాటు నులివెచ్చని కన్నీటిని తీపి చేయగల సాక్ష్యం
యుగయుగాల అవకాశావాదుల కాలక్షేపం
ద్వేషం చేసిన మాయని గయానికి మంత్రం
అవధుల్లేని విషాదాన్ని మరిపించు నవరాగం
నిర్లక్ష్యపు ఆఖరివాక్యాన్ని క్షమించు ఔదార్యం
అనుకోని మలుపులా ఎదురొచ్చి హత్తుకోగల కెరటం
ఊహించని ఉప్పెనలానూ ముంచగలదీ శూన్యం
విశ్వం దాకా విస్తరించిన అదృశ్య చరిత్ర పుటం
నమ్మగలిగితే నిత్యస్ఫూర్తినిచ్చు కన్నుల్లో దైవం 🙏💜
కోట్లానుకోట్ల క్షణాల కౌగిలికి పుట్టిన నిజం
జీవితాన్ని శాసిస్తూ తను మాత్రం కదిలిపోవు దూరం
ఆద్యంతాల అనుభవాలను కనికట్టు చేయగలుగు వేదం
గుండెలమాటు అశను తీర్చగలిగే ప్రణవనాదం
మనసుపడ్డ కవితలా రంజింపజేయు దరహాసం
శిలను శిల్పంగా మలచగల నిశ్శబ్ద గమనం
రెప్పలమాటు నులివెచ్చని కన్నీటిని తీపి చేయగల సాక్ష్యం
యుగయుగాల అవకాశావాదుల కాలక్షేపం
ద్వేషం చేసిన మాయని గయానికి మంత్రం
అవధుల్లేని విషాదాన్ని మరిపించు నవరాగం
నిర్లక్ష్యపు ఆఖరివాక్యాన్ని క్షమించు ఔదార్యం
అనుకోని మలుపులా ఎదురొచ్చి హత్తుకోగల కెరటం
ఊహించని ఉప్పెనలానూ ముంచగలదీ శూన్యం
విశ్వం దాకా విస్తరించిన అదృశ్య చరిత్ర పుటం
నమ్మగలిగితే నిత్యస్ఫూర్తినిచ్చు కన్నుల్లో దైవం 🙏💜
// కలతనిద్దుర //
కబురులు కరువై కేరింతలు కరిగి
కలవరింతలకు కన్నుల్లో కన్నీరు తిరిగి
కనుచూపుమేర చీకటే అలుముకుంటే
కలతనిద్దుర కలలనూ కసిరేస్తుంది
మానసకోయిల విరహమైన సందెల్లో
మోహనరాగమూ విషాదమైన వేళ
మరలిపోయిన చిరునవ్వును పాడలేక
మౌనాన్ని ముడేసుకోడమే ఓ మలుపవుతుంది
మల్లెపందిరి కింద పరిమళపు రుచి
పెదవికి తెలీదన్నట్టు
కౌగిలంటని బ్రతుకు చేదువిందు
కాలానికే మాత్రమే తెలిసిన అనుభవైక్య మరణం
కొన్ని జీవితాలంతే..
వెలుగు పంచడం తెలియని
మిడిసిపడే దీపాల రెపరెపల అపశృతి సంగీతాలు 😒

// చీకటి మడుగు //
చిక్కుముడేసుకున్నట్టు ఆశలన్నీ ఒకేసారి
చీకటి మడుగులో మునిగినప్పుడు
భరోసానివ్వగలిగే చెయ్యేదీ మేఘమవదు..
మౌనపు గలగలలో వినబడ్డ తలపులు
మనసుని మురిపించాలని చూసినా
సంచలిస్తున్న శ్వాస ఒప్పనివ్వదు..
నిశ్శబ్దంలో కరిగే కాలం విలువ
ఒంటరితనపు హద్దును పెంచుకుంటూ
తనలో తానే ఓడి రసభంగమవుతుంది..
కౌగిలించిన తీపిరాగపు చేదు
గుండె గండాన్ని తీర్చేందుకేనని తెలుసుకొనే వరకు
ఆకు 'పచ్చరంగు' మారిపోతుంది 😣

Corona 2
1. ఓ కొత్త పలకరింపుకై వెదుకులాట
మనిషి లోపలి మనిషి
ఇద్దరుగా విడిపోయి
తనను తానే అక్కున చేర్చుకుంటూ
గుండె ఘనీభవించకుండా చేస్తున్న ఓదార్పు ప్రయత్నం
2. ఏమో ఏం జరిగిందో
శూన్యంతో కదిలొచ్చిన వసంతం
లేపనమన్నది లేని గాయాలతో దేహం
తీయని జీవితాన్ని చేదుగా మార్చి
తిరిగి తీపి చేసేందుకు చేస్తున్న కాలక్షేపం
3. చచ్చి బతికిపోయిన వాళ్ళెందరో
ప్రపంచాన్ని అనుసరించే అవసరం లేని కొందరు
కదులుతున్న కాలానికి తలొంచలేనోళ్ళు
చినుకంత సంతోషాన్ని దోసిలిపట్టేందుకు
కాస్త నమ్మకాన్ని వెతుక్కోవడం సహజమిప్పుడు
4. కప్పుకొనేందుకు ఆశే వస్త్రమిప్పుడు
దిగులు తెరలను పక్కకి జరిపి
అడుగులు కలపాల్సిన తరుణమిది
దశాబ్దాల దూరాన్ని కరిగించుకొని
యుద్ధాన్ని గెలిచేందుకే దాగులుమూతలాడుతున్న రహస్యమిది..💜

Saturday, 11 April 2020
// ఆర్తి సందేశం..//
మాయ మొదలయ్యింది. మనసుపొరల్లో దాగిన లాలిత్యానికి మాటలొచ్చినా గుసగుసలు మాత్రమే వల్లిస్తున్న సురగంగలా మారితే గొంతులోని కూనిరాగానికి ప్రారంభమదేగా. ఇంద్రనీలాల కన్నుల్లో ఒకప్పుడు ఒదిగిన ఉదయాలు వేసవిగాలి పలకరింపుతో ప్రకృతి పాడే తొలిపాటలా పులకరింతలిప్పుడు.
స్వప్నాల పుప్పొడి పెదవిపై చిలకరించినదెవ్వరో కొన్ని నవ్వుల సంతోషం విశాలమైంది. అణువంత కేరింత సుదీర్ఘవాక్యమైతే ఆ ఆరాధన విశ్వవ్యాప్తమైంది
మల్లెగాలి వీచినప్పుడు మేఘరాగం వసంతానికి కబురుపెడితే ముద్దమందారాలు నునుతట్టుకి ఉలిక్కిపడ్డట్టు ఈ కాలం, సంపెంగల సన్నాయినొక్కులై.. సిగ్గుపడే అమ్మాయి బుగ్గల్లో సొట్టలై...తీపిరుచి మరిగిన తెరచాటు తపోభంగమై... ఆగనిక్షణాల అలుకని మానుపే అందమైన వ్యాపకం. మౌనప్రవాసం మత్తుగా కౌగిలించే శృంగారవాసంతి వెన్నెల్లో సంగీతాన్ని రంగరించే అతి సుమధుర చంద్రోదయరాత్రి కనుకే బ్రతుకు నేపథ్యమో ఆర్తి సందేశం..💜

// జీవంలేని ప్రాణం //
మాటలు దాచుకున్న మనసు ప్రేమను పంచడం తెలీని పెదవుల తోడు
మెల్లిమెల్లిగా ఎండిపోతుంటుంది..
నిబ్బరంగా ఉండాలనుకున్న దూరాలు నిర్లక్ష్యానికి దారి తీసి
కరిగిపోతున్న కాలాన్ని అసలే గుర్తించవు..
దాటేయాలనుకున్న వారధి అనంతంగా సాగి,
దాటేయాలనుకున్న వారధి అనంతంగా సాగి,
సరిహద్దు కనబడనివ్వని అశాంతిగా పరుచుకుంటుంది..
నిశ్శబ్దంగా మొదలైన ఏకాంతం శూన్యానికి జారి
పొందాలనుకున్నదేదో మరిచిపోతుంది..
జీవితం పరాయిగా మారి సెలవడిగిన వెంటనే
జీవితం పరాయిగా మారి సెలవడిగిన వెంటనే
దిగులొచ్చి అతిథిలా చెంత చేరుతుంది..
ఉత్సవానంతర రోజులా జీవంలేని ప్రాణం
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Baby Shark DooDoo DooDoo Doo.. మళ్ళీ బాల్యంలోనికి పరుగెత్తాలనుంది ఇంద్రజాలమై కదిలే కాలాన్ని వెనక్కి తిప్పాలనుంది చాక్లెట్లు పూసే చెట...
-
అందరిలాగే ఆమెకూ ఆశలెక్కువ అందరికన్నా కూడా ఆమెకు అందమెక్కువ అందాన్ని ఆదరించే లోకముందని తెలిసినప్పుడే మొదలైన భ్రమలు కట్టు బట్టలతో గడప దాట...
-
ఈ వేసవి సాయంత్రాన..ఏదో సుతిమెత్తని రాగం.. మదిలో మొదలైన నిశ్శబ్దం కరిగి కోలాహలమేదో మొదలైనట్టు.. పచ్చదనం మాదిరి పదేపదే పెనవేసుకొనే చిరు...
-
ఇక్కడిక్కడ లోకమనే కచేరీలో పాడుతున్నట్టే కనిపిస్తా ఓ నిమీలిత అనుభూతినై ఏకాంతంలో నేనున్నా మోహంలో మునిగినట్టుండే ఆత్మస్పృహ నేనో అంతర్లోకం...