Friday, 30 October 2020
// ఆ దారి //
ఆ దారి ఎడారి వైపుకని
తెలిసే నువ్వు పయనం మొదలెడతావ్
అక్కడో పలకరింపు లేదని
నీకు నువ్వే దహించుకుపోతావ్
ఎవ్వరినీ తోడు రానియ్యవూ
ఆగి కాసేపు ఆలోచించవూ
మాటలు దాచుకున్న మౌనం నువ్వు
మూగపుస్తకంలా నిన్ను చదువుకోవాలి
నిన్ను ప్రశ్నించాలంటే అసహనానికి సిద్ధమవ్వాలి
మానసికంగా మాత్రమే నువ్వని మది తలుపేసుకోవాలి..😣
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
జ్వలిస్తుంది మనసు చూసీ చూడక వదిలేసిన గ్రీష్మం దేహాన్ని తాకి మంటై ఎగుస్తున్నట్టు.. బరువైన క్షణాలకి సొంతవాక్యం రాసే దిగులు ముద్దులు హద్దయిపో...
-
నిశ్శబ్దం వాలిన పొద్దుల్లో పేరు తెలియని పిట్టల గుసగుసలు ప్రేమలేఖలై గాలి ఊసుల కిలకిలలు కవితలై పువ్వులు పాడే సంగీతం మనసును లేపినట్టయి ...
-
కవితత్వాలు: 244 ప్రేమగంధం అంటిన సన్నజాజి, అంతరంగాన్ని తడుపుకునే తేనెబావి మట్టిభాష కమ్మదనమేదో.. దాహాన్ని తీర్చడానికన్నట్లు తరాలు మారిన...
-
సమస్త సృష్టి నన్ను చూస్తున్నప్పుడు ఎందుకో ఒక్క భావమూ నాలో పలకలేదు విరిగిపోయిన వంతెన అంచుల గుండా నేనెక్కడో తప్పిపోయిన యాతన అడివిమల్లెలా పరిమ...
-
అవ్యాజమైన భావాలతో అల్లుకొనే నిన్ను.. నా ఆత్మకు అద్దముగా మలచుకున్నాను.. నీ రూపు కన్నుల్లో లాస్యమైనప్పుడు మెరుగుపెట్టిన వెన్నెల నేనై ...
No comments:
Post a Comment