Wednesday, 7 October 2020
// గాల్లో దీపం //
పొద్దుగుంకేలోపు జీవితాన్ని మజిలీకి చేర్చాలన్న ఆవేశపు నడక ముగిసేదెన్నడో
దారిపొడవునా ఓర్చిన కష్టాల ఎదురీతలు, అసహాయ మూగబాధలకు విముక్తి ఎప్పుడో
మిణుక్కుమన్న ఆశ ఆసరాతో మొదలైన గమనం..గాయమైనా..ఫలించేది ఎందరికో
బ్రతుకు బరువు మోయలేని అంధకారంలో అకారణన ద్వేషాన్ని జయించి సజీవులయ్యేదెందరో
ఇన్నాళ్ళూ ముడుపుగట్టి దాచుకున్న ఆరోగ్యం గాల్లో దీపమయ్యాక..దుఃఖమవని క్షణాలెక్కడని వెతకాలో 😞
కొత్తగా మరోసారి "నడత" నేర్చుకునైనా వర్తమానాన్ని కాపాడుకుందాం
అనివార్య నిశ్శబ్దానికని .. ఘనీభవించిన కాలానికి చలనమొచ్చింది కనుక
ఏమరుపాటునొదిలి ఈ యాదృచ్ఛికానికి ఎదురీదగలిగినోళ్ళకే విజయమని గుర్తుపెట్టుకుందాం.!!
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
పదేపదే జారుతున్న ఊహల్లో అనేక రంగులు ఏకమై చెదిరిపోయినట్టు నిన్నటివే జ్ఞాపకాలు.. కన్నీటితో సమంగా కాలం కరుగుతున్నా అలుపులేని అవస్థలో...
-
అవును.. మెరిసే నక్షత్రాన్ని చూడాలనుకొనే కళ్ళు ఆకాశాన్ని అంతగా పట్టించుకోవు బరువుగా కదులుతున్న మేఘం కురుస్తుందని ఆశపడ్డా అది సంధ్య ముస...
-
ఎన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నదో ఓ మనసు పాట ఇప్పటికీ అదే ఆర్తితో వినాలనిపించే మధువొలుకు పాట అయితే వెన్నెలొలుకు రాతిరిలో విషాదాన...
-
ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు నల్లనిమబ్బులమయమైన ఆకాశం మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది ఒంటరిగా యాతన పడుత...
-
చేయిపట్టి జీవితంలోకి నడిపించాలనుకున్నా తడబడినట్టే కనిపిస్తావెప్పుడూ రేపో రోజు నాతో కలిసుండాలనిపించినప్పుడు నీ తడికన్నుల్లో నీరై జారిపో...

No comments:
Post a Comment