మంచు కురిసేవేళ నవ్విన
మల్లెలకు పరిమళం ఎక్కువని
మనసుకెక్కిన "కిక్కు" చెప్పింది
ఎక్కువ దూరం వెళ్ళకుండానే
ఇన్నాళ్ళూ వెతికినది దొరికిన
Smiley ఎమోజీ మొహంలో..
నేనో విహంగం..నాదే ఆకాశం..
నేనో సముద్రం..నాదే సమస్తం..
ఈ క్షణపు అస్తిత్వమే స్వభావ సహజసిద్ధమైనదని తెలిసాక
చుట్టూ వెదజల్లుకున్న పుప్పొడి అలజడి ఎక్కువై
ఆనందవిషాద మిళితంలో
హాయి రహస్యం తెలిసింది..
నాలో నేను ప్రవహిస్తున్న తీరులో
Happy Harmones..
Now I feel like I'm Not Alone..
దగ్గరగా వినిపిస్తున్న పాటెంతో నచ్చిందిప్పుడు
"ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు..
ఇన్నాళ్ళకు విరిసె వసంతములు.."
No comments:
Post a Comment