ఎంత మెత్తగా కదిలిందో హేమంత రాత్రి
వెచ్చని పరిష్వంగంలో నన్నుంచి
ఇచ్చిన కల ఒకటే అయినా
ఎన్ని ఊహలు నిజం చేసిందో
చీకటంటే దిగులు మోసుకు తిరిగే సమయమనుకున్నా
వెలుగు తప్పించే శూన్యమని
రాగాలు మింగేసే రహస్య దుఃఖమనుకున్నా
మనసుని లాగే లేత కాంతి
సుగంధమై పొదుపుకున్నాక
అరవిరిసిన అందం హాయిరాగాన్ని కోరింది
గుండె లయని మార్చే వెచ్చని ఊపిరి కోసమని
అంతరంగం అలుకను వీడింది
మనసున మనసై మెదులుతూ నువ్వున్నా
మనం కలిసే కాలం కోసమే ఎదురుచూపు
మిన్నొదిలి కురిసే మంచు మోహనమైతే
లోలోపల పల్లవిస్తున్న ప్రణయం పూర్వీ కళ్యాణియే..

No comments:
Post a Comment