ఇన్నాళ్ళూ నీ మౌనంలో
మరపురాని కావ్యాలెన్ని రాసావో
నా అలుకలోని పంతాలు ఈనాటికి తీరలేదు
పాటక్కడ పలుకిక్కడని ఉడుక్కుంటూ
నీ ధ్యాసనెంత కదపాలని చూసినా
ఓ పలుకు ముత్యమూ జారలేదు
ఎన్ని ఘడియలు రెప్పలు మూయక
నా రూపాన్నారాధించావో
నిద్దురలో నే నవ్వుకున్న స్వప్నాన్నడగాలి
మనసంతా సంచరించే చనువు
నాకెందుకిచ్చావో మాత్రం
నీ ఆంతర్యపు ఆకాశానికే తెలియాలి
అనుసరించడం ఆపేయమని అడగాలని నాకున్నా
రహస్యమయ్యేందుకు నీ హృదయం తప్ప
వేరే చోటేదీ లేదు కనుక
ఈ దూరాన్ని చెరపమనే నే వేడుకుంటున్నా..

No comments:
Post a Comment