నువ్వు నవ్విన పరవశాలు ముద్దులుగా నా బుగ్గలు తాకినప్పుడే తెలిసింది
హద్దులు తెలియని మనసు జలపాతమై ఎగిసిందని
నాకు తెలిసిన అమావస్యకు చీకటొక్కటే తెలుసు..
నిన్నూ నన్నూ కలపమని నేలజారే నక్షత్రమేదో కోరుకొని ఉంటుంది..
ఒక్కొక్కటిగా రాలిన భాష్పానికి మాటలొస్తే..
మోము కప్పుకొని తీర్చిన ముంగురుల అలుకలే మోహమై కురిసాయని
మౌనంగా మార్చుకున్న మన గుండె ఊసులే చెప్తాయి..
తడి పెదవుల్లో ఊరిన మకరందం నువ్వు తాగిన తన్మయత్వాన్ని పాడతాయి..
రెండు తెల్లని పావురాల్లా మనిద్దరం..
కొత్తగా రెక్కలొచ్చిన ఆకాశంలో స్వేచ్ఛా విహారం..
రోజూ కలలో కనిపించేదే నిజమైనట్టు..
నేనే నువ్వైపోయిన క్షణాలనడగాలి..
అంతగా నన్ను లాలించిన నీ సమక్షంలోని గమ్మత్తేమిటోనని..💞
No comments:
Post a Comment