ఊపిరి తూలిపోతున్నట్టు
మనసు యాతన పడటం
ఈ రాత్రికిదేం కొత్తకాదు
పగటికలకు తడబడుతున్న
కళ్ళు మాత్రం
ఏదో వెతుకుతున్నట్టు తెలుస్తుంది
చలిగాలి చేరేయాలని చూస్తున్న రహస్యం
సగం మత్తులా ఆవహించి
నిశ్శబ్దాన్ని నాటేసి నిన్నల్ని వెతకమంటుంది
అంతగా పరిచయంలేని సుగంధం
ఆర్తిగా అల్లుకున్నప్పుడు తెలిసింది
అనాలోచితానికీ ఓ గమ్యముంటుందని
ఆకర్షించేందుకే నన్నది అనుసరిస్తుందని..!!
మనసు యాతన పడటం
ఈ రాత్రికిదేం కొత్తకాదు
పగటికలకు తడబడుతున్న
కళ్ళు మాత్రం
ఏదో వెతుకుతున్నట్టు తెలుస్తుంది
చలిగాలి చేరేయాలని చూస్తున్న రహస్యం
సగం మత్తులా ఆవహించి
నిశ్శబ్దాన్ని నాటేసి నిన్నల్ని వెతకమంటుంది
అంతగా పరిచయంలేని సుగంధం
ఆర్తిగా అల్లుకున్నప్పుడు తెలిసింది
అనాలోచితానికీ ఓ గమ్యముంటుందని
ఆకర్షించేందుకే నన్నది అనుసరిస్తుందని..!!
No comments:
Post a Comment