Thursday, 10 January 2019

ప్రత్యూష పిలుపు

తొలిపొద్దు రాగంతో మనసు నిద్దురలేపిన
వలపు గాలి కదా నీదైన తలపు
పండగంటి ప్రమోదాన్ని అలుపులేక మోసుకొచ్చిన
పువ్వంత సున్నితం కదా ప్రత్యూష పిలుపు
చిరుమువ్వల సవ్వడిగా మొదలైన సంగీతం
చంచలమైన ఊహలకు సాయంగా కుదిరాక
నీలోకి అడుగులేస్తున్న ఏకాంత క్షణాలేగా
నాకత్యంత ప్రియమైన ప్రయాణాలు..
ఇష్టపదులెన్ని రాసుకోవాలో తెలియని ఆనందం
ఊసులరాసులన్నీ మూటగట్టి మురిసిన వైనాన
కాలమెప్పుడు కలుపుతుందో తెలియని సందేహంలో
ఆశలకు ఊతమిస్తూ రాయలేనా మధురకావ్యం..💞

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *