కొన్ని తలపులు సీతాకోకలై తడిమినప్పుడు
జ్ఞాపకాలు కవితలై మనసంతా గెంతులేస్తాయి
నాలో దాగిన నీ సందడి ఉత్సవమై
చిరునవ్వుల భావానందం కల్యాణిరాగాన్ని పాడమంటుంది
సంపెంగి ధూపమల్లె నా ఊపిరి నాకే వింతైన గమ్మత్తులో
చిలిపి వెన్నెల గంధమై ఊయలూపుతుంది
మకరందమేదో కురిసి ఏకాంతాన్ని వెచ్చగా తడిపినట్టు
కొన్ని మధురభావాలకు అంతముండబోదు
మౌనపు సంప్రీతిలో ఉక్కిరిబిక్కిరయ్యే నాకు
తీరని తనివినిలా రాయాలనే ఉంటుంది
అవును
సాయంకాలపు నీరెండల్లో పంచుకున్న క్షణాల పరవశాలు
కాటుక చుక్కలై కదులుతున్నా..ఆ అనుభూతిని కౌగిలించాలనే ఉంటుంది..

No comments:
Post a Comment