Thursday, 9 December 2021

Tributes to Sirivennela garu

ప్రణవనాదమంతా నిశ్శబ్దంగా మారి అవ్యక్తపు జ్ఞాపకాలను నెమరేస్తూ భావరాహిత్యపు నేపధ్యాన్ని 'సిరివెన్నెల' కుండపోతలా కుమ్మరిస్తున్న రేయి విషాదపు పొలిమేరలు దాటి వెంటాడుతూ వదలని వాస్తవానికి వెక్కుతున్న ఎన్నో ప్రాణాలకిది వేదనాపుకోవడం తెలియని వర్తమానం మరపురాని మాటలన్నీ కొత్త రాగాల్లో కూర్చేసి.. వీనులకి సౌరభాలనద్దేసి చివరాఖరికి చెప్పా చేయకుండా గుండెబరువు పెంచి మరీ వెళ్ళిపోయారు మీ అంతరాత్మకు ఆటంకంలేని దారి సుగమం కావాలనాశిస్తూ కన్నీటి వీడ్కోలివి

దుఃఖం..

అలికిడి చేసే రాగాలకి దుఃఖం అడ్డుపడ్డాక.. జోలపాటలూ రాని యాతనవుతుంది కలలో కనిపించిన కాగితప్పడవలు పసిదనంలో ముంచేసినట్లు అనిపించినా మెలకువ రాగానే వాస్తవపు విషాదం షరా మామూలే శ్వాస ఆడక మరణించిన ఆశల గురించి పెద్దగా ఆలోచించినా ఏముంటుందని అయితే క్షణానికీ క్షణానికీ మధ్య కాలం మారుతుందేమో.. నిశ్శబ్దానికి మాత్రమే అలవాటుపడ్డ మనసు నీడకు చోటిచ్చేంత ఉదాత్తమవుతుంది !

Tuesday, 19 October 2021

విషాద సముద్రం

ఒక్కోసారి విషాదం సముద్రంలా అలలు విరుగుతుంది నిన్నంతా తడిపి నిస్పృహలో నిలబెడుతుంది ఊపిరాడక గింజుకునేలా, ఓడిపోయిన అనాథలా పచ్చిగాయాన్ని రేపుతుంది నీకు నువ్వే ఘనీభవించిన రాయిగా మారాక నీ కలల్ని దోచుకుని ఆడుకుంటుంది గుప్పిట్లో దాచుకున్న సందిగ్ధాలు నిశ్శబ్దాన్ని శబ్దం చేస్తూ చిగురించే సమయం ఎప్పుడో దాటిపోయిందని అన్యాపదేశ ప్రకటన వినిపిస్తుంది ఇదేదో అర్ధంకాని రోదనలా ఎదుటివారికి కనిపించినా నిన్ను మాత్రం గుక్కపెట్టేలా ఏడిపిస్తుంది లోకం మొత్తం ఏకమై శపించినట్లు రొదపెట్టే అనుభవాలు తడుముకుంటూ బ్రతుకంతా బాధని మోయమని తీర్మానిస్తుంది

గతం గతః..

ఆమె: హేయ్..ఎందుకలా ఎప్పుడూ విషాదంలో ఉన్నట్టుంటావ్ అతను: కొన్ని స్వరాలకు సరిహద్దులుండనట్టు నిశ్శబ్దం రాగమైన రాత్రిపూట ఒంటరితనానికదో విషాదపు కల ఆమె: కవిత్వం బాగుంది..కానీ ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు అతను: నిలువక తరలిపొతున్నదే అయినా ప్రతిక్షణం గడిచిపోయిన కాలాన్ని ఉబికే అలల్ని తోడినట్టు జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం నాకదో వ్యసనం.. ఆమె: ఓహ్..ఇప్పుడు కొంచం కొంచం అర్ధమవుతోంది అతను: మనసుపొరల్లో దాక్కొన్న దిగులుకి మాటలు పూడుకుపోయినా మౌనం మిగిలుందని ఆత్మ పాడుకొనే మధురగీతం పడమటి కోయిల ఆక్రోశం.. ఆమె: ఆపింక..అంతకంతకూ విశాలమవుతున్న చింతనావలోకంలో కాలస్పృహ కరిగి అనిశ్చితమైన ఓ అనుభవం మాత్రం బిగుసుకుంటుంది. అతను: ?? ఆమె: గతం యొక్క అవశేషాలు నీ "ప్రస్తుతాన్ని" లోపించేలా చేస్తున్న రహస్యం నీకు తెలుసా? అతను: ....!! ఆమె: విజయాన్ని తొడుక్కోవాలని ఉందా లేదా అతను: &%$@# ఆమె: నిన్నటిని సమాథి చేయాలంటే రేపటికి ఎగరాల్సిన నీ ఆకాశాన్ని ఊహించు అతను: అదంతా జరిగే పనేనా.. ఆమె: మనోవ్యథకి మందువేసి ముందు నీ విలువ పెంచుకో ఇప్పటి నీ కన్నీళ్ళు రేపటి ఆనందభాష్పాలు కాగలవు అతను: అందుకే అన్నారేమో..చక్కని చెలిమి ఎక్కడో ఉండదు చిరునవ్వుతో పరామర్శించే హృదయంలో ఉంటుందని..

Endurance..

అప్రమత్తంగా ఉన్న నిన్ను విషాదం నిర్దయగా కమ్ముకుంటున్నా కొత్తగా ఊపిరి పోసుకునే ఆలోచనలేవీ ఉండవు కాలం కదులుతూనే ఉంటుందని తెలిసినా కలిసి నడిచే తోడు కోసం చూడదని మర్చిపోతావ్ ఎన్నో గాయాలకోర్చిన నీ నగ్నపాదాలు శిఖరానికేసి నడవడమింక కష్టమని ఆగిపోతాయ్ తీర్చలేని వాగ్దానాలన్నీ మౌనం పాటిస్తున్నట్టనిపించగానే భ్రమలు తొలగిపోతున్న దృశ్యం కంటికడ్డొస్తుంది అంతే.. గ్రహణం పట్టినట్టున్న ఈరోజు మీద అసహనం పెరుగుతున్నా భరిస్తూనే ఉండిపోతావ్ !!

Monday, 10 May 2021

స్వేచ్ఛా ప్రకటన..



యాంత్రిక జీవనంలో గుండె ఘనీభవించడం
వెచ్చని ఆత్మశక్తిని నిర్లక్ష్యం చేసినందుకే కాబోలు
అర్ధంలేని ప్రాకులాటలో ఆనందమో గాలిలో దీపమైంది

కదిలే మేఘాల అవిశ్రాంత పయనంలో
ఋతురాగపు రంగుల సహజ  ప్రేమతత్వమే
అసలైన ఆహ్లాదనల  ఆత్మీయతా మధురగీతం 

జంటస్వరాల పదనిసల్లో చిక్కని స్నేహముందని తెలిస్తే
చిరునవ్వుల పాలపుంతలు.. కన్నుల్లో మెరుపుల యేరులేగా 

ఏదేమైనా
కాలప్రవాహపు మలుపుల్లో విరామం..
అనుభూతుల ఆస్వాదనకు తప్ప
అలసిపోయి నిర్వికార విషాదమవ్వొద్దు 

ప్రతి నిమిషం గతాన్నో భవిష్యత్తునో ఊహించడమాపితే
కనుచూపు మేర కనిపించే సుందర దృశ్యాలెన్నో కదూ ❤

Sunday, 28 March 2021

// ఆనందం //

 మనసుకి హద్దులు గీయడం

తెలిసిన జీవితం సుద్దులతోనే ఆంక్షలు పెడుతుంది
ఊహల రెక్కల విహారాలతో
ఋతువులను పలకరిస్తూ పండుగలూ చేస్తుంది
నిత్యమాలపించే రాగాలూ ఆత్మీకరణాలూ
సరికొత్త కలలతో లోకాన్ని చూపిస్తుంది
మానసికానందపు జాగృతులన్నీ
మజిలీ చేరేలోపు తపస్సు చేసైనా సాధించమంటుంది 🙂
What makes u different makes u beautiful 😍

// Floating Life.. //

 ఎవరన్నారు ప్రకృతి సోమరిగా ఉంటుందని

అలుపెరిగని పద్యంలా పరుగెత్తుతూ పోతుందది

సూర్యుడు ఒక్కపూట సెలవు తీసుకుంటే
ఆహ్లాదం గానీ.. నిత్యం బద్దకిస్తే చీకటది

ఋతువులు కదిలి రోజులు మారుతుంటే
ఉత్సాహం గానీ.. ఒకేలాగుంటే నీరవమది

ఎప్పుడూ పనీపాటల్లో మునిగి
అప్పుడప్పుడూ చిలిపిగెంతులేస్తే కదా జీవితం

స్మృతులకి సాగిలపడి గ్రీష్మాన్నే వగచేవారికి
వర్షంలో తడిచినా స్వేదమనేదొక్కటే భావన

ప్రవాహాన్ని తోచీతోచక ఉరకలేస్తుందనుకుంటే
మన వంట్లో రక్తం కూడా ఒకేచోట నిలిచిపోగలదు

విజయాన్ని వెంటబెట్టుకు తిరిగేవారికి మేఘాలూ దారిస్తాయి
నక్షత్రమాల వరించేందుకు ఆకాశానికంతా ఎగిరొచ్చాడనీ..😍

ఏమో..
మనసుకిటికీ తెరిచి
జ్ఞాపకాల ఊరేగింపులో వెనుకబడేవాడు
నిదురని మరచి పగటికలని మాత్రమే ప్రేమించగలడు

P.S., ఈ ప్రపంచంలో అందరికన్నా బద్దకస్తుడు..
"గర్భిణీ స్ర్రీ"ని పెళ్ళి చేసుకునేవాడు - Yandamoori Veerendranath 

// సెగలు //

 జ్వలిస్తుంది మనసు

చూసీ చూడక వదిలేసిన గ్రీష్మం
దేహాన్ని తాకి మంటై ఎగుస్తున్నట్టు..
బరువైన క్షణాలకి
సొంతవాక్యం రాసే దిగులు
ముద్దులు హద్దయిపోయినప్పటి సెగలు
కోల్పోయిన నవ్వులకి
నెత్తుటి మరకలు పూసిందెవరో
మిగిలిన రంగులన్నీ వెలిసిపోయినట్టు..
మత్తెక్కించే పాటలన్నీ
ప్రణయాగ్ని కీలలై చుట్టుముట్టే వేళ
భావాల భాషంతా గుండెల్లో ఘోష
మధురమైన మాటలకు రెక్కలొచ్చి
ఎటో ఎగిరిపోయిన దారిలో
నిశ్శబ్దపు ఊరేగింపు చెల్లాచెదురైనట్టు
ఉదయాస్తమానాల నా ఊహలు..
కొండెక్కే వరకూ ఆగాల్సిందే
కొన్ని గాయాలు కన్నీళ్ళతో కడగలేమంతే 😥

// మిణుగురులు //

 నదులు వెనక్కి కొండల్లోకి తిరిగినట్టు

నరాల్లో సత్తువ ఆక్రోశించలేక వేళ్ళాడుతుంది
రోజులన్నీ చీకటివే అయితే అగాధలోతుల్లోకి
జారినట్టు కన్ను ఏడుస్తుంది
ఒంటరితనానికి దిక్కులే దిక్కన్నట్టు
మనసు ప్రతిధ్వనించి సమాధాన పరిచాక
జీవితాన్ని మించినదేదీ ముఖ్యమైంది కాదని
నిట్టూర్పులే ఈలలుగా మారుతాయి
గాలిలో దీపమనుక్కున్న ఆరోగ్యం ఇప్పుడో అవసరం
గమ్యమో ప్రశ్నార్ధకమైనా సత్యాన్ని మోయాలనుకున్నాక
రెపరెపలాడుతున్న ఊపిరికి కొంత ఆయువు దొరికి
ఆశలకు భవిష్యత్తనే ప్రాణం పోస్తుంది
పాత నమ్మకాలు వదిలి కొత్త సిద్ధాంతాలు కూర్చుకున్నా
ఎక్కాలనుకున్న శిఖరం ఎంత ఎత్తునున్నా
విషాదానికి సెలవుచీటీ రాసిచ్చేసాక
జీవితానికి ఎదురు తిరగాలనిపిస్తుంది
ఇదిగో..ఇప్పుడు మొదలవుతుంది నా పాట
"మనసా..గెలుపు నీదేరా
మనిషై..వెలిగిపోవేరా" అని 😂

Clever strategy..

  



కొందరుంటారలా..
ఎదుటివారి బాధలు స్పష్టంగా తెలుస్తున్నా
కావాలనే రెచ్చగొడుతూ 
తమ 'ఓటితనాన్ని' బయటేసుకుంటారు

మహాద్భుతాన్ని దర్శించాలని ఈదురుగాలికి ఎదురెళ్ళి
వ్యామోహమనే వలలోచిక్కి
కీచురాళ్ళ రొదనే వల్లిస్తుంటారు

'మాయ' తోడుగా ప్రయాణం చేస్తున్న మనిషికి
వస్తుభ్రాంతి పట్ల..
'నేను' తనం పట్ల విపరీతమైన ఆకర్షణ ఉంటుంది

మరొకరి గుండెల్లో ఆర్తి నింపడం తెలీకపోయినా
గిచ్చి గాయంచేసే అలవాటు ఒదులుకోరు

సమస్యల వలయంలో ఉన్నా, 
హాయి మైదానాన్ని సృష్టించుకోగలగాలంటే
ప్రేమ 'పెట్టుపోతల' విలువలు తెలిసుండాలి

చీకటిలో నిద్రలేచే జ్ఞాపకాలకి పరిమళమున్నట్టు
జీవితాన్ని మచ్చిక చేసుకున్నవారికి మాత్రమే,
ఏకాకితనాన్నీ.. వాక్యంగా రాసుకోగలిగే విలక్షణముంటుంది  class="CToWUd"


Saturday, 30 January 2021

// శబ్దరాహిత్యం //

శబ్దరాహిత్యపు ప్రపంచంలో క్షణమో యుగమై కదిలినట్టు అనిపించినా కదలికలున్న కాలం చెంగుచెంగున ఉరకలేస్తూనే పోతుంది సముద్రగర్భపు మంచు స్పర్శలో ఎడారి అంచున శూన్యపు నిట్టూర్పుల్లో సంతోషాన్ని వీడిపోయిన విషాదాల్లో వెతికేందుకేముందని.. ఉక్కిరిబిక్కిరయ్యే సందిగ్ధం తప్ప ఇష్టాలు పాతబడి ఒంటరితనపు చీకటిగదిపై మనసుపడ్డాక గుండెను తట్టే చిరునవ్వులేవీ ఉండబోవిక చిరుముద్దులు సమాధైన చోట కన్నుల్లో కన్నీళ్ళు మరుగడం నిత్యమయినట్టేనిక 😔

// పరాయి స్వప్నం //

As u r always comfortable being alone.. u'll never know.. if u choose someone out of love or lonliness 😶 పరాయి స్వప్నాలతో బెంగపడి నిర్జలసముద్రాన్ని మోహిస్తున్నప్పుడు నువ్వు రాసిన వాక్యాలు అపరచితమైనవేమో మాట్లాడేందుకు మౌనం తప్ప మరేం లేదనుకున్న చీకట్లో నువ్వున్నప్పుడు అలికిడయ్యే భావాలు అనవసరాలేమో నిశ్శబ్దం నీకేదో నేర్పిందని గుండెచెమ్మతో దాహం తీర్చుకుంటున్నప్పుడు ఏ స్నేహమూ ఎదురొచ్చి పలకరించదు శోకాన్ని పరామర్శించలేనంటూ ఒంటరిదారుల్లో చిక్కుపడిపోతే నీ చేదుసాయింత్రానికి స్పందించేవారుండరు నీ కళ్ళు నవ్వులొద్దనుకున్నాక ఆ ఖాళీలని కళ్ళద్దాలు కప్పుతాయనేగా.. కానివ్వు.. కురిసే ప్రతిచినుకూ ఆర్తిని నింపలేవు కొన్నలా ప్రవహించేందుకు జారతాయంతే 😔

// Life shtyle //

జీవించేందుకు ఎన్నో అవకాశాలున్న లోకంలో ఎవరికెవరూ ఏమీకాలేరని తెలిసి తన ఉనికి కోసరం మనిషి చేసే అస్తిత్వపోరాటంలో భాగమే నేను అన్న నినాదం ఎవరిక్కావాలిప్పుడు గాలి ఏవైపు నుంచీ వీస్తుందో నడిసంద్రంలో సంచలిస్తున్న నావ మోస్తున్న బరువుకి ఏవైపు కుంగుతుందో.. వెనుక నడిచే నీడగురించే తెలియని మనం నింగీనేలా ఒకదాని కుతూహలానికి ఒకటి తొంగిచూసుకునే విస్మయాన్నేం తెలుసుకుంటాం ఏవేళకా వేళ ఆకలి తీర్చుకుంటూ ఎడతెగని ఆహారపు అన్వేషణలో ఉన్న పక్షి అగచాట్లని దొంగతపంగానే నవ్వుకుంటాం నలుపు తెలుపులుగా ఉన్న దేహానికి ప్రేమా విరహాలనే ఆచ్ఛాదనలు కప్పుకుంది కాక కావాలనుకున్న ఆశలను దోసిలిపట్టి మరీ దాచుకుంటాం ఎవరి ధర్మాన్ని వారు ఆచరించమని ప్రకృతి ఆదేశాలు, శాస్త్ర సమ్మతాలు అర్ధమయ్యాక 'నా' గుణింతమొక్కటే ఇప్పుడు అత్యధికంగా ఆచరిస్తున్న సుఖశాంతుల జీవనవిధానం..😊 "If u have d ability to luv.. Love urself first" is d present Life Shtyle Mantra..😂

// ఆర్తిలేని గతం //

ప్రతీదీ మారకమైన ప్రపంచంలో పుచ్చుకోడంలో ఉన్న ఉత్సాహం తిరిగివ్వాలనే తపన ఎందరికుంటుంది ఆర్తిలేని గతానికి వర్తమానాన్నిచ్చి కాలాన్ని కలగంటూ గడిపే వారు కొమ్మచివరి చిగురు స్ఫూర్తంటూ చెప్పుకుంటారు అసందర్భానుసార ప్రేమ అనుకుంటారుగానీ అసలో కారణమో, కష్టమో రావాలేమో ప్రేమ రుచి తెలుసుకోవడానికి ఏమో.. కొందరు చెలిమిని మాటల్లేనితనానికిచ్చేసి చీకటినే చుట్టుకుని పెనుగులాడుతుంటారు 😔

// నిశ్శబ్దం //

సమస్త సృష్టి నన్ను చూస్తున్నప్పుడు ఎందుకో ఒక్క భావమూ నాలో పలకలేదు విరిగిపోయిన వంతెన అంచుల గుండా నేనెక్కడో తప్పిపోయిన యాతన అడివిమల్లెలా పరిమళించే మది వాడిపోయిన నిశ్శబ్ద ఘడియల్లో కలగన్న గాయం నిజమయినట్టు చిక్కబడ్డ చీకటినీడల సాక్షీభూతం ఏమో.. ఈ రోజంతా శూన్యం పరిమళాలు పోగుపడని హృదయంతో అవధులు దాటలేక నిస్సహాయమైన వర్తమానం 😔

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *