Saturday, 30 January 2021
// Life shtyle //
జీవించేందుకు ఎన్నో అవకాశాలున్న లోకంలో
ఎవరికెవరూ ఏమీకాలేరని తెలిసి తన ఉనికి కోసరం
మనిషి చేసే అస్తిత్వపోరాటంలో భాగమే నేను అన్న నినాదం
ఎవరిక్కావాలిప్పుడు
గాలి ఏవైపు నుంచీ వీస్తుందో
నడిసంద్రంలో సంచలిస్తున్న నావ
మోస్తున్న బరువుకి ఏవైపు కుంగుతుందో..
వెనుక నడిచే నీడగురించే తెలియని మనం
నింగీనేలా ఒకదాని కుతూహలానికి ఒకటి
తొంగిచూసుకునే విస్మయాన్నేం తెలుసుకుంటాం
ఏవేళకా వేళ ఆకలి తీర్చుకుంటూ
ఎడతెగని ఆహారపు అన్వేషణలో ఉన్న
పక్షి అగచాట్లని దొంగతపంగానే నవ్వుకుంటాం
నలుపు తెలుపులుగా ఉన్న దేహానికి
ప్రేమా విరహాలనే ఆచ్ఛాదనలు కప్పుకుంది కాక
కావాలనుకున్న ఆశలను దోసిలిపట్టి మరీ దాచుకుంటాం
ఎవరి ధర్మాన్ని వారు ఆచరించమని
ప్రకృతి ఆదేశాలు, శాస్త్ర సమ్మతాలు అర్ధమయ్యాక
'నా' గుణింతమొక్కటే ఇప్పుడు అత్యధికంగా
ఆచరిస్తున్న సుఖశాంతుల జీవనవిధానం..😊
"If u have d ability to luv.. Love urself first"
is d present Life Shtyle Mantra..😂
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
జ్వలిస్తుంది మనసు చూసీ చూడక వదిలేసిన గ్రీష్మం దేహాన్ని తాకి మంటై ఎగుస్తున్నట్టు.. బరువైన క్షణాలకి సొంతవాక్యం రాసే దిగులు ముద్దులు హద్దయిపో...
-
నిశ్శబ్దం వాలిన పొద్దుల్లో పేరు తెలియని పిట్టల గుసగుసలు ప్రేమలేఖలై గాలి ఊసుల కిలకిలలు కవితలై పువ్వులు పాడే సంగీతం మనసును లేపినట్టయి ...
-
కవితత్వాలు: 244 ప్రేమగంధం అంటిన సన్నజాజి, అంతరంగాన్ని తడుపుకునే తేనెబావి మట్టిభాష కమ్మదనమేదో.. దాహాన్ని తీర్చడానికన్నట్లు తరాలు మారిన...
-
సమస్త సృష్టి నన్ను చూస్తున్నప్పుడు ఎందుకో ఒక్క భావమూ నాలో పలకలేదు విరిగిపోయిన వంతెన అంచుల గుండా నేనెక్కడో తప్పిపోయిన యాతన అడివిమల్లెలా పరిమ...
-
అవ్యాజమైన భావాలతో అల్లుకొనే నిన్ను.. నా ఆత్మకు అద్దముగా మలచుకున్నాను.. నీ రూపు కన్నుల్లో లాస్యమైనప్పుడు మెరుగుపెట్టిన వెన్నెల నేనై ...
No comments:
Post a Comment