Tuesday, 19 October 2021
గతం గతః..
ఆమె: హేయ్..ఎందుకలా ఎప్పుడూ విషాదంలో ఉన్నట్టుంటావ్
అతను: కొన్ని స్వరాలకు సరిహద్దులుండనట్టు
నిశ్శబ్దం రాగమైన రాత్రిపూట
ఒంటరితనానికదో విషాదపు కల
ఆమె: కవిత్వం బాగుంది..కానీ ఒక్క ముక్క అర్ధమైతే ఒట్టు
అతను: నిలువక తరలిపొతున్నదే అయినా
ప్రతిక్షణం గడిచిపోయిన కాలాన్ని
ఉబికే అలల్ని తోడినట్టు
జ్ఞాపకాన్ని నెమరేసుకోవడం
నాకదో వ్యసనం..
ఆమె: ఓహ్..ఇప్పుడు కొంచం కొంచం అర్ధమవుతోంది
అతను: మనసుపొరల్లో దాక్కొన్న దిగులుకి
మాటలు పూడుకుపోయినా మౌనం మిగిలుందని
ఆత్మ పాడుకొనే మధురగీతం
పడమటి కోయిల ఆక్రోశం..
ఆమె: ఆపింక..అంతకంతకూ విశాలమవుతున్న
చింతనావలోకంలో కాలస్పృహ కరిగి
అనిశ్చితమైన ఓ అనుభవం మాత్రం బిగుసుకుంటుంది.
అతను: ??
ఆమె: గతం యొక్క అవశేషాలు నీ "ప్రస్తుతాన్ని"
లోపించేలా చేస్తున్న రహస్యం నీకు తెలుసా?
అతను: ....!!
ఆమె: విజయాన్ని తొడుక్కోవాలని ఉందా లేదా
అతను: &%$@#
ఆమె: నిన్నటిని సమాథి చేయాలంటే
రేపటికి ఎగరాల్సిన నీ ఆకాశాన్ని ఊహించు
అతను: అదంతా జరిగే పనేనా..
ఆమె: మనోవ్యథకి మందువేసి ముందు నీ విలువ పెంచుకో
ఇప్పటి నీ కన్నీళ్ళు రేపటి ఆనందభాష్పాలు కాగలవు
అతను: అందుకే అన్నారేమో..చక్కని చెలిమి ఎక్కడో ఉండదు
చిరునవ్వుతో పరామర్శించే హృదయంలో ఉంటుందని..
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
పదేపదే జారుతున్న ఊహల్లో అనేక రంగులు ఏకమై చెదిరిపోయినట్టు నిన్నటివే జ్ఞాపకాలు.. కన్నీటితో సమంగా కాలం కరుగుతున్నా అలుపులేని అవస్థలో...
-
అవును.. మెరిసే నక్షత్రాన్ని చూడాలనుకొనే కళ్ళు ఆకాశాన్ని అంతగా పట్టించుకోవు బరువుగా కదులుతున్న మేఘం కురుస్తుందని ఆశపడ్డా అది సంధ్య ముస...
-
ఎన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నదో ఓ మనసు పాట ఇప్పటికీ అదే ఆర్తితో వినాలనిపించే మధువొలుకు పాట అయితే వెన్నెలొలుకు రాతిరిలో విషాదాన...
-
ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు నల్లనిమబ్బులమయమైన ఆకాశం మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది ఒంటరిగా యాతన పడుత...
-
చేయిపట్టి జీవితంలోకి నడిపించాలనుకున్నా తడబడినట్టే కనిపిస్తావెప్పుడూ రేపో రోజు నాతో కలిసుండాలనిపించినప్పుడు నీ తడికన్నుల్లో నీరై జారిపో...

No comments:
Post a Comment