Monday, 10 May 2021

స్వేచ్ఛా ప్రకటన..



యాంత్రిక జీవనంలో గుండె ఘనీభవించడం
వెచ్చని ఆత్మశక్తిని నిర్లక్ష్యం చేసినందుకే కాబోలు
అర్ధంలేని ప్రాకులాటలో ఆనందమో గాలిలో దీపమైంది

కదిలే మేఘాల అవిశ్రాంత పయనంలో
ఋతురాగపు రంగుల సహజ  ప్రేమతత్వమే
అసలైన ఆహ్లాదనల  ఆత్మీయతా మధురగీతం 

జంటస్వరాల పదనిసల్లో చిక్కని స్నేహముందని తెలిస్తే
చిరునవ్వుల పాలపుంతలు.. కన్నుల్లో మెరుపుల యేరులేగా 

ఏదేమైనా
కాలప్రవాహపు మలుపుల్లో విరామం..
అనుభూతుల ఆస్వాదనకు తప్ప
అలసిపోయి నిర్వికార విషాదమవ్వొద్దు 

ప్రతి నిమిషం గతాన్నో భవిష్యత్తునో ఊహించడమాపితే
కనుచూపు మేర కనిపించే సుందర దృశ్యాలెన్నో కదూ ❤

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *