గాలి వీచినప్పుడల్లా తలలూపే పూలు
ఏ ప్రేమరాగానికి పరవశిస్తున్నవోనని తలపోసా
అణువణువూ మధురాన్ని పొందిన అలౌకికాన్ని ఆరాతీసి
మౌనాన్ని తర్జుమా చేసే స్పర్శ ఉంటుందని తెలుసుకున్నా
మనసంతా కళ్ళు చేసుకొని సంతోషపడ్డ
సాయింత్రమేదీ ఈనాటికీ లేదసలు..
కలల వంతెన మీద కలిసిన నువ్వూ నేనూ
నవ్వుతూ కదిలే క్షణాల కోసమనే ఎదురుచూస్తున్నా
అనాదిగా ముద్రించుకున్న నిశ్శబ్దం
వెన్నెలొచ్చి తాగేయాలేమో ఇప్పుడు
కొమ్మల నడుమ కూసే కోయిలనై..
మురిపెముగా కనుచివరలు కలిసేలా కువకువలాడాలనుంది 💜☘️

No comments:
Post a Comment