Tuesday, 29 December 2015

// ఆ కళ్ళు//




// ఆ కళ్ళు//
కలల యవనికను గుట్టుగా తెరిచే వాకిళ్ళు..
తలపులకు తలుపులు తీసే అందమైన లోగిళ్ళు..
రెప్పల సయ్యాటలో దాగిపొమ్మనే సంకేతాలు
కమ్మని కౌగిలికి రమ్మని ఆహ్వానించే చిలిపి నెగళ్ళు
వేల ఆనందాలకాంతులు తనలోనే ఇముడ్చుకున్న గోళాలు
ప్రకృతి భాషను ప్రేమగా చదివే జావళీలు
ఆమని నయగారాలు సన్నగా వొంపు కెరటాలు
పిట్టల రెక్కల చప్పుళ్ళకి తాళమేసే కిటికీలు
పెదవుల వలపుపదాలకు తాళమేసే రవళులు..
ఊసులకు మరువాలనద్ది పరిమళింపజేసే యుగళాలు..
వెన్నెల మౌనాలను రట్టు చేసే సందళ్ళు..
వెరసి..
ప్రియమైన చెలికాడ్ని చాటు చేసే మేఘాలు..
విరహించిన మదిలో తమకాన్ని రేకెత్తించే మోహాలు..wink emoticon

1 comment:

  1. రెప్పల సయ్యాటలో దాగిపొమ్మనే సంకేతాలు చాలా బాగుంది కవితా వాక్యం. ఊసులకు మరువాలనద్ది పరిమళింపజేసే యుగళాలు.....మరువాలు అంటే అర్థం కాలేదు.

    ReplyDelete

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *