Tuesday, 12 January 2016

//ఒకటే జ్ఞాపకం//



గుభాళించినప్పుడే అనుకున్నా..
నువ్వో పరిమళమై అలుకున్నావని
తియ్యందనం తోచినప్పుడే తడుముకున్నా..
నన్ను తలచుకునుంటావని..
ఓదార్చుకోలేకపొయా..
నువ్వు దూరమైన క్షణాలు గుర్తొచ్చి
పలకరించే ధైర్యమూ చేయలేకపోయా
విధిని ఓడించి నిన్ను గెలువలేనని..
అందుకే కాలాన్ని కనికరించమని వేడుకున్నా..
అక్షరాల అనునయంతోనైనా నా గాయాలకు మందు పూస్తుందని..
ప్రతిసారీ నిన్ను రాసిన చేతిని ముద్దాడుకుంటున్నా
భావంగానైనా నిన్ను ఒదిగించి అందంగా పొదిగిందని
అందేంత దూరంలోనే నువ్వున్నావనే సందేశమిచ్చిందని
ఎప్పటికైనా మనిద్దరం జతయ్యే ఉంటామని..
చెలియలకట్టను దాటి చెలిమి చేయి అందుకొనే రోజొస్తుందని..!!
 
 

2 comments:

  1. హృదయ గాయానికి అక్షరాలమందు (కవిత్వం). చాలా బాగా రాసారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు Mruganayani (మృగనయని) గారు

      Delete

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *