నులివెచ్చగా దేహం కంపించగలదని
కలల్లో నీతో కబురులాడే కనులకి తెలుసోలేదో
అంతరాళంలో ఆకాశం ఆలపిస్తున్న ఆనందభైరవి
ప్రతిధ్వనిస్తున్న సవ్వడి నీకు అనుభవమయ్యే ఉంటుంది
మబ్బులా కప్పుకున్న ఏకాంతంలో అదే మాట వినిపిస్తుంది
నిజంగా అన్నావా..
"A part of me always loves a part of u.." అని..
నాలోంచీ నేనూ..నీలో వువ్వూ..మనకి మనం
ఎదురుపడకుండానే వలపు జలపాతంలో తడిచున్నామా..🤔
నిమజ్జనం చేసేసిన భావాలకు మాటలొస్తే ఏమంటాయో
నీ ప్రేమకు భాష్యం నా భాష్పాలుగా వివరిస్తాయేమో
ఏం చెప్పనిప్పుడు..
నీలో చిరుకోపాన్ని సైతం అందమైన నవ్వుగా మార్చి నన్ను ఓదార్చుతున్నాక..
అయినా సరే..
నీ సమస్తాన్ని తలపు చాటునే దాచుకో ఇక
నా హృదయం పక్షి ఈకలా గమ్యాన్నెప్పుడో మరిచిపోయిందని చెప్తున్నాగా 💕

No comments:
Post a Comment