Wednesday, 13 July 2022

// Morning Ragas //

అలవికాని పనుల యాతనలో మనసు మడతలు విప్పి నన్ను పలకరించేంత ఆర్తి ఏ తలపుకీ ఉండదు ఒక్కోసారి నేనలా ఖాళీగా కూర్చోగానే చెట్టుకీ పిట్టకీ ఆనందం అలలేసి నా రంగురంగుల మట్టిగాజులు లెక్కెడతాయా.. ముఖాన్ని ఎరుపు చేసే చిరునవ్వుకి తోడు మౌనంగా నాసికను చేరి గుండెనింపే కాఫీ పరిమళమొక్కటీ అంతర్ముఖానికీ ఉత్సాహాన్నిస్తుంది తమని వినడానికే వచ్చానని పువ్వుల కేరింతలు చూడాలప్పుడు.. కాసేపు నన్ను ఆదమరచిపొమ్మని చెప్పకనే చెప్పేస్తాయి

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *