Tuesday, 12 July 2022
// గాయాల సలుపు //
సత్యమనే బరువు మోస్తున్న నీలో
ఓ తిరుగుబాటు ఉండే ఉంటుంది
మనసు దాచుకున్నన్నాళ్ళూ
నువ్వు ప్రసరించే చూపుల్లో
అదో రహస్యంగా నిద్రిస్తున్నట్టే అనిపిస్తుంది
నిన్ను నువ్వు విదిలించుకుంటూ
ఉక్రోషమైనంతసేపూ
అస్థిమితదారుల్లో కలదిరుగుతూనే ఉంటావేమో...
గుండెల్లో ఘోషిస్తున్న శబ్దాలు
నిశ్శబ్ద లోయల్లోకి జారి
అంతర్వేచన ముగిసినప్పుడే
సూక్ష్మ గాయాల సలుపు నెమ్మదిస్తుంది
చెప్పాలనుకున్నదేదీ పెదవి దాటలేకపోయాక
రెప్పలగోడలమాటే నీ దాగుడుమూతలాట సాగాలిక
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
పదేపదే జారుతున్న ఊహల్లో అనేక రంగులు ఏకమై చెదిరిపోయినట్టు నిన్నటివే జ్ఞాపకాలు.. కన్నీటితో సమంగా కాలం కరుగుతున్నా అలుపులేని అవస్థలో...
-
అవును.. మెరిసే నక్షత్రాన్ని చూడాలనుకొనే కళ్ళు ఆకాశాన్ని అంతగా పట్టించుకోవు బరువుగా కదులుతున్న మేఘం కురుస్తుందని ఆశపడ్డా అది సంధ్య ముస...
-
ఎన్ని దశాబ్దాలుగా అనుసరిస్తున్నదో ఓ మనసు పాట ఇప్పటికీ అదే ఆర్తితో వినాలనిపించే మధువొలుకు పాట అయితే వెన్నెలొలుకు రాతిరిలో విషాదాన...
-
ఒక్కోసారి చీకటి చప్పుడు చేస్తూ చిరుగాలిని సైతం ఆలకించనివ్వదు నల్లనిమబ్బులమయమైన ఆకాశం మరో నల్లని విషాదంతో పోటీ పడుతుంటుంది ఒంటరిగా యాతన పడుత...
-
చేయిపట్టి జీవితంలోకి నడిపించాలనుకున్నా తడబడినట్టే కనిపిస్తావెప్పుడూ రేపో రోజు నాతో కలిసుండాలనిపించినప్పుడు నీ తడికన్నుల్లో నీరై జారిపో...

No comments:
Post a Comment