Tuesday, 12 July 2022

// మల్లె మొగ్గలు //

మౌనంగా చిగురించే కాలానికి ఆత్మానందపు క్షణాలంటే మనలోంచీ మనల్ని తీసుకుపోయేవేమో.. ఏమో.. వేసవికన్నా ముందే మురిపించే ఈ మొగ్గల ముగ్ధత్వం బిడియాల పచ్చిదేహపు సమ్మోహనం నీరెండలో నిర్మలంగా నవ్వే నక్షత్రాల్లా ఈ అద్భుతమైన గుబుర్ల చెంతనుంటే మనసంతా పరవశాల కాంతి వలయం అవునవే.. మోహాన్ని మోస్తూ తన్మయత్వంగా కొమ్మకు ఊగుతున్న మల్లెపువ్వులు.. పరిమళాలతో అలికిడి చేస్తున్నాయంటే విచ్చుకుని ఎంతసేపయ్యిందో

No comments:

Post a Comment

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *