Saturday, 30 January 2021

// శబ్దరాహిత్యం //

శబ్దరాహిత్యపు ప్రపంచంలో క్షణమో యుగమై కదిలినట్టు అనిపించినా కదలికలున్న కాలం చెంగుచెంగున ఉరకలేస్తూనే పోతుంది సముద్రగర్భపు మంచు స్పర్శలో ఎడారి అంచున శూన్యపు నిట్టూర్పుల్లో సంతోషాన్ని వీడిపోయిన విషాదాల్లో వెతికేందుకేముందని.. ఉక్కిరిబిక్కిరయ్యే సందిగ్ధం తప్ప ఇష్టాలు పాతబడి ఒంటరితనపు చీకటిగదిపై మనసుపడ్డాక గుండెను తట్టే చిరునవ్వులేవీ ఉండబోవిక చిరుముద్దులు సమాధైన చోట కన్నుల్లో కన్నీళ్ళు మరుగడం నిత్యమయినట్టేనిక 😔

// పరాయి స్వప్నం //

As u r always comfortable being alone.. u'll never know.. if u choose someone out of love or lonliness 😶 పరాయి స్వప్నాలతో బెంగపడి నిర్జలసముద్రాన్ని మోహిస్తున్నప్పుడు నువ్వు రాసిన వాక్యాలు అపరచితమైనవేమో మాట్లాడేందుకు మౌనం తప్ప మరేం లేదనుకున్న చీకట్లో నువ్వున్నప్పుడు అలికిడయ్యే భావాలు అనవసరాలేమో నిశ్శబ్దం నీకేదో నేర్పిందని గుండెచెమ్మతో దాహం తీర్చుకుంటున్నప్పుడు ఏ స్నేహమూ ఎదురొచ్చి పలకరించదు శోకాన్ని పరామర్శించలేనంటూ ఒంటరిదారుల్లో చిక్కుపడిపోతే నీ చేదుసాయింత్రానికి స్పందించేవారుండరు నీ కళ్ళు నవ్వులొద్దనుకున్నాక ఆ ఖాళీలని కళ్ళద్దాలు కప్పుతాయనేగా.. కానివ్వు.. కురిసే ప్రతిచినుకూ ఆర్తిని నింపలేవు కొన్నలా ప్రవహించేందుకు జారతాయంతే 😔

// Life shtyle //

జీవించేందుకు ఎన్నో అవకాశాలున్న లోకంలో ఎవరికెవరూ ఏమీకాలేరని తెలిసి తన ఉనికి కోసరం మనిషి చేసే అస్తిత్వపోరాటంలో భాగమే నేను అన్న నినాదం ఎవరిక్కావాలిప్పుడు గాలి ఏవైపు నుంచీ వీస్తుందో నడిసంద్రంలో సంచలిస్తున్న నావ మోస్తున్న బరువుకి ఏవైపు కుంగుతుందో.. వెనుక నడిచే నీడగురించే తెలియని మనం నింగీనేలా ఒకదాని కుతూహలానికి ఒకటి తొంగిచూసుకునే విస్మయాన్నేం తెలుసుకుంటాం ఏవేళకా వేళ ఆకలి తీర్చుకుంటూ ఎడతెగని ఆహారపు అన్వేషణలో ఉన్న పక్షి అగచాట్లని దొంగతపంగానే నవ్వుకుంటాం నలుపు తెలుపులుగా ఉన్న దేహానికి ప్రేమా విరహాలనే ఆచ్ఛాదనలు కప్పుకుంది కాక కావాలనుకున్న ఆశలను దోసిలిపట్టి మరీ దాచుకుంటాం ఎవరి ధర్మాన్ని వారు ఆచరించమని ప్రకృతి ఆదేశాలు, శాస్త్ర సమ్మతాలు అర్ధమయ్యాక 'నా' గుణింతమొక్కటే ఇప్పుడు అత్యధికంగా ఆచరిస్తున్న సుఖశాంతుల జీవనవిధానం..😊 "If u have d ability to luv.. Love urself first" is d present Life Shtyle Mantra..😂

// ఆర్తిలేని గతం //

ప్రతీదీ మారకమైన ప్రపంచంలో పుచ్చుకోడంలో ఉన్న ఉత్సాహం తిరిగివ్వాలనే తపన ఎందరికుంటుంది ఆర్తిలేని గతానికి వర్తమానాన్నిచ్చి కాలాన్ని కలగంటూ గడిపే వారు కొమ్మచివరి చిగురు స్ఫూర్తంటూ చెప్పుకుంటారు అసందర్భానుసార ప్రేమ అనుకుంటారుగానీ అసలో కారణమో, కష్టమో రావాలేమో ప్రేమ రుచి తెలుసుకోవడానికి ఏమో.. కొందరు చెలిమిని మాటల్లేనితనానికిచ్చేసి చీకటినే చుట్టుకుని పెనుగులాడుతుంటారు 😔

// నిశ్శబ్దం //

సమస్త సృష్టి నన్ను చూస్తున్నప్పుడు ఎందుకో ఒక్క భావమూ నాలో పలకలేదు విరిగిపోయిన వంతెన అంచుల గుండా నేనెక్కడో తప్పిపోయిన యాతన అడివిమల్లెలా పరిమళించే మది వాడిపోయిన నిశ్శబ్ద ఘడియల్లో కలగన్న గాయం నిజమయినట్టు చిక్కబడ్డ చీకటినీడల సాక్షీభూతం ఏమో.. ఈ రోజంతా శూన్యం పరిమళాలు పోగుపడని హృదయంతో అవధులు దాటలేక నిస్సహాయమైన వర్తమానం 😔

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *