రాధికా స్వసాంత్వనం
మనసున మల్లెలు పరిమళించిన వేళలో ...అక్షర సుమమాలలు
Monday, 8 July 2024
హేమంతంలో వసంతం... 😌
హేమంతపు తెమ్మెర చలిగా అరుస్తూ
నీ మౌనాన్ని అనువదిస్తుందేమో..
ఆకాశపుటంచుల వెంబడి ఆ వచనం
ఆహ్లాదపు ప్రేమలేఖగా
నాలో నిండిన భావోద్వేగం..
ప్రదోష ప్రాణాయామంలో పీల్చుకున్న శ్వాస
నీ జ్ఞాపకమే అయినట్టు
ఎద తోటకి ఇప్పుడు వసంతఋతువేమో..
వెన్నెల్లో గోవర్ధనం గుండెల్లోకొచ్చి
గోరువెచ్చనైన కలలు పొదిగినట్టు
ఈ వేకువ వాత్స్యాయన సుప్రభాతం...
అక్కడా ఇక్కడాని సౌందర్యాన్ని, సంతోషాన్ని
నేనేం వెతకలేదులే..
నీలో కాంతివేగానికి నాలో శీతలత్వం కరిగి
చిగురిస్తున్నానని చెప్తున్నా అంతే !!
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
శబ్దరాహిత్యపు ప్రపంచంలో క్షణమో యుగమై కదిలినట్టు అనిపించినా కదలికలున్న కాలం చెంగుచెంగున ఉరకలేస్తూనే పోతుంది సముద్రగర్భపు మంచు స్పర్శలో ఎడార...
-
సమస్త సృష్టి నన్ను చూస్తున్నప్పుడు ఎందుకో ఒక్క భావమూ నాలో పలకలేదు విరిగిపోయిన వంతెన అంచుల గుండా నేనెక్కడో తప్పిపోయిన యాతన అడివిమల్లెలా పరిమ...
-
కొందరుంటారలా.. ఎదుటివారి బాధలు స్పష్టంగా తెలుస్తున్నా కావాలనే రెచ్చగొడుతూ తమ 'ఓటితనాన్ని' బయటేసుకుంటారు మహాద్భుతాన్ని దర్శించాలన...
-
జీవించేందుకు ఎన్నో అవకాశాలున్న లోకంలో ఎవరికెవరూ ఏమీకాలేరని తెలిసి తన ఉనికి కోసరం మనిషి చేసే అస్తిత్వపోరాటంలో భాగమే నేను అన్న నినాదం ఎవరిక్క...
-
As u r always comfortable being alone.. u'll never know.. if u choose someone out of love or lonliness 😶 పరాయి స్వప్నాలతో బెంగపడి నిర...
-
ప్రతీదీ మారకమైన ప్రపంచంలో పుచ్చుకోడంలో ఉన్న ఉత్సాహం తిరిగివ్వాలనే తపన ఎందరికుంటుంది ఆర్తిలేని గతానికి వర్తమానాన్నిచ్చి కాలాన్ని కలగంటూ గడిప...