Thursday, 9 December 2021
Tributes to Sirivennela garu
ప్రణవనాదమంతా నిశ్శబ్దంగా మారి
అవ్యక్తపు జ్ఞాపకాలను నెమరేస్తూ
భావరాహిత్యపు నేపధ్యాన్ని
'సిరివెన్నెల' కుండపోతలా కుమ్మరిస్తున్న రేయి
విషాదపు పొలిమేరలు దాటి
వెంటాడుతూ వదలని వాస్తవానికి
వెక్కుతున్న ఎన్నో ప్రాణాలకిది
వేదనాపుకోవడం తెలియని వర్తమానం
మరపురాని మాటలన్నీ
కొత్త రాగాల్లో కూర్చేసి.. వీనులకి సౌరభాలనద్దేసి
చివరాఖరికి చెప్పా చేయకుండా
గుండెబరువు పెంచి మరీ వెళ్ళిపోయారు
మీ అంతరాత్మకు ఆటంకంలేని దారి
సుగమం కావాలనాశిస్తూ కన్నీటి వీడ్కోలివి
దుఃఖం..
అలికిడి చేసే రాగాలకి
దుఃఖం అడ్డుపడ్డాక..
జోలపాటలూ రాని యాతనవుతుంది
కలలో కనిపించిన కాగితప్పడవలు
పసిదనంలో ముంచేసినట్లు అనిపించినా
మెలకువ రాగానే వాస్తవపు విషాదం
షరా మామూలే
శ్వాస ఆడక మరణించిన ఆశల గురించి
పెద్దగా ఆలోచించినా ఏముంటుందని
అయితే
క్షణానికీ క్షణానికీ మధ్య
కాలం మారుతుందేమో..
నిశ్శబ్దానికి మాత్రమే అలవాటుపడ్డ మనసు
నీడకు చోటిచ్చేంత ఉదాత్తమవుతుంది !
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
Baby Shark DooDoo DooDoo Doo.. మళ్ళీ బాల్యంలోనికి పరుగెత్తాలనుంది ఇంద్రజాలమై కదిలే కాలాన్ని వెనక్కి తిప్పాలనుంది చాక్లెట్లు పూసే చెట...
-
అందరిలాగే ఆమెకూ ఆశలెక్కువ అందరికన్నా కూడా ఆమెకు అందమెక్కువ అందాన్ని ఆదరించే లోకముందని తెలిసినప్పుడే మొదలైన భ్రమలు కట్టు బట్టలతో గడప దాట...
-
ఈ వేసవి సాయంత్రాన..ఏదో సుతిమెత్తని రాగం.. మదిలో మొదలైన నిశ్శబ్దం కరిగి కోలాహలమేదో మొదలైనట్టు.. పచ్చదనం మాదిరి పదేపదే పెనవేసుకొనే చిరు...
-
ఇక్కడిక్కడ లోకమనే కచేరీలో పాడుతున్నట్టే కనిపిస్తా ఓ నిమీలిత అనుభూతినై ఏకాంతంలో నేనున్నా మోహంలో మునిగినట్టుండే ఆత్మస్పృహ నేనో అంతర్లోకం...