Thursday, 27 August 2020

// మనసు చేసే గారడీ //

నిశ్శబ్దానికి అందంగా స్పందిస్తూ రసమయ దారుల్లో సాగునప్పుడు ఊగిసలాడుతూ మనసు చేసే గారడీ స్రవించే చీకటిని గమనించదు కలలో ప్రతికొమ్మా కబుర్లు చెప్పేదే వెన్నెల కౌగిలిలో వెతలు మరిపించేదే.. గులాబీల గాలికి ముక్కు మూసుకొనే ఆడంబరం ఓ ఆత్మాభిమానమయ్యాక ఉక్కిరిబిక్కిరి అవ్వడమే సహజమప్పుడు అయినా.. పగిలిన నవ్వులకు లేపనం పూసుకోడం తెలియని పెదవులకు చెప్పేదేముందని.. పదాలలో ప్రణయకాంక్ష గుప్పించినంత తీపి కాదు జీవితం వగరు వేదాంతమూ కలగలిసినదీ వైచిత్రి మూలమని నీకూ తెలిసినప్పుడు 💜

Popular Posts

మీ అమూల్యమైన స్పందనను తెలియచేయండి

Name

Email *

Message *